Karnataka : యడ్యూరప్పకు హైకోర్టులో ఎదురుదెబ్బ..

యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు.

Published By: HashtagU Telugu Desk
Yediyurappa setback in the High Court..

Yediyurappa setback in the High Court..

Karnataka : కర్ణాటక హైకోర్టులో మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్‌ యడ్యూరప్పకు ఎదురుదెబ్బ తగిలింది. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో ఆయనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేసేందుకు హైకోర్టు నిరాకరించింది. కేసును ట్రయల్‌ కోర్టుకు అప్పగించింది. అయితే.. ఈ క్రమంలోనే ఆయనకు స్వల్ప ఉపశమనం కల్పించింది. ముందస్తు బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. యడ్యూరప్పను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్‌ను ఇచ్చింది. ఈ కేసులో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తు ఎం నాగప్రసన్న ఈ మేరకు తీర్పును వెలువరించారు. మాజీ ముఖ్యమంత్రిపై పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైన విషయం తెలిసిందే.

Read Also: Ram Gopal Varma : పోలీసుల విచారణకు హాజరైన ఆర్జీవీ..

తనపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారని 2022లో ఫిబ్రవరిలో 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తనపై పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ ను క్వాష్ చేయడంతో పాటు తనకు ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని యడ్యూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అదేవిధంగా కేసు ట్రయల్ సమయంలో విచారణ ఎదర్కొవడం తప్పనిసరి అని ధర్మాసనం పేర్కొంది.

కాగా, 17 ఏళ్ల బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది మార్చి 14న యడ్యూరప్పపై కేసు నమోదైంది. ఫిబ్రవరి 2న డాలర్స్‌ కాలనీలోని తన నివాసంలో యడ్యూరప్ప తన కూతురుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ మహిళ ఆరోపించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోక్సో చట్టంలో సెక్షన్‌ 8, ఐపీసీ సెక్షన్ 354 (ఎ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కేసు విచారణ సందర్భంగా యడ్యూరప్పపై వచ్చిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. తల్లి, కుమార్తె గతంలో ఓ పాత కేసుకు సంబంధించి మాజీ సీఎంను సంప్రదించారని.. అందులోని మరో వ్యక్తి బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వాదించారు.

Read Also: CM Chandrababu : సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్ బృందం భేటీ

 

  Last Updated: 07 Feb 2025, 02:12 PM IST