Yediyurappa: లక్కీ నంబర్ కారు అసెంబ్లీకి పంపగలదా ?

కర్ణాటకలోని షికారిపుర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు బీజేపీ సీనియర్ లీడర్ బి.ఎస్. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర

Yediyurappa: కర్ణాటకలోని షికారిపుర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నాడు బీజేపీ సీనియర్ లీడర్ బి.ఎస్. యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర. ఈ మేరకు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ వేసేందుకు తన తండ్రితో కలిసి ఎన్నికల కార్యాలయానికి బయలుదేరాడు. అయితే వారి కుటుంబానికి కలిసొచ్చిన లక్కీ నంబర్ గల తెలుపు రంగు అంబాసిడర్ కారులో వెళ్లడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది.

రాష్ట్రానికి నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయిన యడ్యూరప్ప1983లో తన మొదటి ఎన్నికల నుంచి ఈ కారునే వాడుతున్నారు. ఈ కారు ఆయన రాజకీయానికి లక్కీగా భావిస్తారు. ఆయన గ్యారేజిలో ఎన్నో కార్లు ఉన్నప్పటికీ హిందుస్థాన్ మోటార్స్ నిర్మించిన అంబాసిడర్ కారునే అతను వాడేందుకు మొగ్గుచూపుతాడు. ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ “CKR 45.1987లో యడియూరప్ప కొనుగోలు చేసిన తొలి కారు ఇదేనని, అప్పటి నుంచి కుటుంబీకులు దానిని తమ వద్దే ఉంచుకున్నారని బంధువుల్లో ఒకరు తెలిపారు.

యడ్యూరప్ప పెద్ద కుమారుడు రాఘవేంద్ర మాట్లాడుతూ.. ‘మా నాన్న అన్ని అధికారిక పనుల కోసం ఈ కారులోనే ప్రయాణించేవారని గుర్తు చేసుకున్నారు. కొన్నేళ్లుగా ఈ కారుని వాడకపోయినా కారును జ్ఞాపకంగా ఉంచుకున్నామని చెప్పారు. ఇది సుమారు 10 ఏళ్లుగా నిరుపయోగంగా ఉంది.యడ్యూరప్ప తొలిసారిగా 1983లో కర్ణాటక శాసనసభలో అడుగుపెట్టి నాలుగేళ్ల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. యడ్యూరప్ప ‘4’ మరియు ‘5’ మొత్తాన్ని ‘9’ అదృష్ట సంఖ్యగా భావిస్తారని అనుచరుడు తెలిపాడు, నిజానికి తన సంఖ్య 9కి తగ్గట్టే అతను ఇప్పటివరకు రాష్ట్రంలో తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాడు. యడ్యూరప్ప క్రియాశీల రాజకీయాల నుండి రిటైరయ్యారు. ఇప్పుడు షికారిపుర నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయేంద్ర పోటీ చేస్తున్నారు.

Read More: America: అమెరికాలో తప్పిపోయిన ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతదేహాలు లభ్యం