Site icon HashtagU Telugu

Yashwant Sinha: విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా

Yashwant Sinha

Yashwant Sinha

విప‌క్షాల ఉమ్మ‌డి రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా మాజీ కేంద్ర మంత్రి, టీఎంసీ ఉపాధ్యక్షుడు య‌శ్వంత్ సిన్హా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌నున్నారు. అందుకే, ఆయ‌న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఉపాధ్యక్ష ప‌దవితో పాటు అన్ని పార్టీ పదవులకు రాజీనామా చేశారు. “గొప్ప ప్రతిపక్ష ఐక్యత” కోసం వైదొలగుతున్నట్లు ఒక అధికారిక ట్వీట్‌లో వెల్ల‌డించారు. ఇప్పుడు ఒక పెద్ద జాతీయ ప్రయోజనం కోసం విపక్షాల ఐక్యత ను చాటేందుకు పని చేయడానికి సమయం ఆసన్నమైంద‌ని సిన్హా అన్నారు. 84 ఏళ్ల యశాంత్ సిన్హా దశాబ్దానికి పైగా భారతీయ జనతా పార్టీలో ఉన్న తర్వాత 2018లో TMCలో చేరారు. దివంగత ప్రధానమంత్రి, సీనియర్ బిజెపి నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో ఆయన ఆర్థిక మరియు విదేశీ వ్యవహారాలకు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లిందని ఆరోపిస్తూ యశ్వంత్ సిన్హా బీజేపీని వీడారు.