Site icon HashtagU Telugu

Wrestlers’ protest: రెజ్ల‌ర్లు, పోలీస్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌-ఢిల్లీలో ఉద్రిక్తం

Wrestlers' Protest

Wrestlers' Protest

రెజ్ల‌ర్ల (Wrestlers’ protest) పోరాటం ఉద్రిక్త‌త వైపు మ‌ళ్లింది. వాళ్ల‌కు మ‌ద్ద‌తు ప్ర‌జ‌లు త‌ర‌లి వ‌స్తున్నారు. దీంతో ఢిల్లీ పోలీస్ (Delhi Police)అప్ర‌మ‌త్తం అయింది. ఢిల్లీ పోలీసులు జంతర్ మంతర్ వద్ద గురువారం భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. నిరసన చేస్తున్న రెజ్లర్లు, కొంతమంది పోలీసు సిబ్బంది మధ్య ఘర్షణ చెలరేగింది. కొంద‌రు నిరసనకారులకు తలకు గాయాలయ్యాయి. దీంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.నిరసన స్థలం చుట్టూ అనేక పొరల బారికేడ్లు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది. ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు.రైతులు, రైతు నాయకులు గురువారం ఉదయం నిరసన స్థలంలో సమావేశమవ్వాలని నిర్ణ‌యించారు. ఆ రెజ్లర్లు పిలుపునిచ్చిన క్ర‌మంలో పోలీసులు అప్ర‌మ‌త్తం అయ్యారు. జంతర్ మంతర్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడడాన్ని ఆపడానికి పోలీసులు నగర సరిహద్దుల వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

రెజ్ల‌ర్ల  పోరాటం ఉద్రిక్తం(Wrestlers’ protest)

గ‌త కొన్ని నెల‌లుగా భార‌త రెజ్ల‌ర్ల(Wrestlers’ protest)ఫెడ‌రేష‌న్ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ లైంగిక వేధింపుల‌కు వ్య‌తిరేకంగా కొంద‌రు రెజ్ల‌ర్లు నిర‌స‌న చేస్తున్నారు. ఆయ‌న్ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ పోలీస్ నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో సుప్రీం కోర్టుకు ఈ వివాదం వెళ్లింది. చ‌ట్టం ప్ర‌కారం సింగ్ మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. ఆ మేర‌కు కేసు న‌మోదు చేసిన పోలీసులు(Delhi Police) అకస్మాత్తుగా రెజ్ల‌ర్ల‌తో బుధ‌వారం రాత్రి గొడ‌వ ప‌డ్డారు. ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. దీంతో కొంద‌రు రెజ్ల‌ర్లు గాయ‌ప‌డ్డారు. తమపై పోలీసు సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించారని రెజ్లర్లు ఆరోపించారు.

బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు

నిరసనకారులు చెబుతోన్న ప్ర‌కారం రెజ్లర్లు (Wrestlers’ protest) రాహుల్ యాదవ్ , దుష్యంత్ ఫోగట్ కూడా గాయపడ్డారు. ఫోగట్ తలకు గాయాలయ్యాయి. బుధవారం అర్థరాత్రి, రెజ్లర్లకు మద్దతుగా సంఘటనా స్థలానికి చేరుకున్న రాజ్యసభ ఎంపీ దీపేంద్ర హుడా, ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చైర్‌పర్సన్ స్వాతి మలివాల్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రెజ్లర్లు ఏప్రిల్ 23 నుండి జంతర్ మంతర్ వద్ద నిర‌స‌న‌కు దిగారు. వారు రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఉత్తరాది నుండి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపి సింగ్‌. అందుకే, ఆయ‌న్ను అరెస్ట్ చేయ‌డంలేద‌ని రెజ్ల‌ర్ల‌తో పాటు ప్రత్య‌ర్థి పార్టీల ఆరోప‌ణ‌.

Also Read : Delhi Excise Scam : ఢిల్లీ లిక్క‌ర్‌ కేసులో మూడ‌వ ఛార్జీషీట్ వేసిన ఈడీ

రెజ్ల‌ర్లు, పోలీసులు మ‌ధ్య బుధ‌వారం రాత్రి జ‌రిగిన ఘ‌ర్ష‌ణ వాళ్ల ఉద్య‌మాన్ని మ‌లుపు తిప్పింది. మ‌ద్యం మ‌త్తులో కొంద‌రు రెజ్ల‌ర్లు (Wrestlers’ protest) దాడి చేశార‌ని పోలీసులు చెబుతున్నారు. అందుకే, వాళ్ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశామ‌ని వాదిస్తున్నారు. ఫ‌లితంగా ఘ‌ర్ష‌ణ జ‌రిగింద‌ని వివ‌రిస్తున్నారు. అందుకు సంబంధించిన కొన్ని వీడియోల‌ను కూడా సోష‌ల్ మీడియా వేదిక‌గా క‌నిపిస్తున్నాయి. వాటి ఆధారంగా బుధ‌వారం రాత్రి ఏమిటి జ‌రిగింది? అనే దానిపై స్ప‌ష్టం వ‌స్తుంద‌ని తెలుస్తోంది.

Also Read : Delhi Tour Secrets : కేసీఆర్ ఢిల్లీ టూర్ టాక్స్