Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా దేశంలోని ప్రముఖ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద తమ నిరసన (Wrestlers Protest)ను కొనసాగిస్తున్నారు. కాగా, ఈనెల 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహా పంచాయత్ (Mahapanchayat) నిర్వహించాలని రెజ్లర్లు నిర్ణయించారు. మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. మంగళవారం (మే 23) నిరసన తెలిపిన రెజ్లర్లు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ నుండి ఇండియా గేట్ వరకు మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ తర్వాత రెజ్లర్ వినేష్ ఫోగట్ విలేకరులతో మాట్లాడుత.. “మేము మార్చి 28 న కొత్త పార్లమెంటు భవనం ముందు శాంతియుతంగా మహిళా మహా పంచాయత్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నాము.” అని తెలిపారు.
మహా పంచాయత్ కి మహిళలు నాయకత్వం
ఈ మహా పంచాయత్‌కు మహిళలు నాయకత్వం వహిస్తారని వినేష్ ఫోగట్ తెలిపారు. దీంతో పాటు లేవనెత్తిన ఈ స్వరం ఎంతో దూరం వెళ్లాలని అన్నారు. ఈరోజు దేశపు ఆడపడుచులకు న్యాయం జరిగితే రాబోయే తరాలు ధైర్యం తెచ్చుకుంటాయన్నారు. వినేష్ ఫోగట్, బజరంగ్ పునియా, సాక్షి మాలిక్‌లతో సహా పలువురు అగ్రశ్రేణి రెజ్లర్లు ఏప్రిల్ 23 నుండి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేస్తున్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై రెజ్లర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.
Also Read: GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్
బ్రిజ్‌భూషణ్‌పై రెండు ఎఫ్‌ఐఆర్‌లు
బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఏప్రిల్ 28న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో పోస్కో కింద మైనర్ బాలిక ఫిర్యాదుపై సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా, ఇతర రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఫిర్యాదుపై మరో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ నెల ప్రారంభంలో రెజ్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిపై లైంగిక వేధింపుల ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఢిల్లీ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. కాగా, రెజ్లర్ల ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు రెజ్లింగ్ సమాఖ్య కార్యకలాపాలన్నింటినీ క్రీడా మంత్రిత్వ శాఖ తాత్కాలికంగా నిలిపివేసింది.