Wrestlers 5 Demands : కేంద్రమంత్రి ఎదుట రెజ్లర్ల 5 డిమాండ్లు

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తో బుధవారం ఉదయం చర్చలు జరిపిన రెజ్లర్లు 5 డిమాండ్లు(Wrestlers 5 Demands) పెట్టారు. వాటిలో కీలకమైన డిమాండ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు  మహిళ ను చీఫ్ గా నియమించాలి అనేది !!

  • Written By:
  • Updated On - June 7, 2023 / 02:10 PM IST

కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ తో బుధవారం ఉదయం చర్చలు జరిపిన రెజ్లర్లు 5 డిమాండ్లు(Wrestlers 5 Demands) పెట్టారు. వాటిలో కీలకమైన డిమాండ్.. భారత రెజ్లింగ్ సమాఖ్యకు  మహిళ ను చీఫ్ గా నియమించాలి అనేది !! ప్రస్తుతం  భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ గా ఉన్న బ్రిజ్ భూషణ్ స్థానంలో మహిళ ను చీఫ్ గా నియమించాలని రెజ్లర్లు కేంద్రమంత్రిని డిమాండ్ చేశారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కేంద్ర  మంత్రి అనురాగ్ ఠాకూర్‌ ఆహ్వానం మేరకు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఈ రోజు ఆయన్ను ఇంట్లో కలిసి చర్చలు జరిపారు. అయితే ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిర్వహించిన నెలరోజుల  నిరసనల్లో కీలకంగా వ్యవహరించిన మరో రెజ్లర్ వినేష్ ఫోగట్ ఈ చర్చల్లో పాల్గొనలేదు. ఆమె ఖాప్ పంచాయత్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు హర్యానాలోని తన ఊరు బలాలీకి వెళ్లినందున ఈ మీటింగ్ కు రాలేదని తెలిసింది.

రెజ్లర్ల డిమాండ్లు(Wrestlers 5 Demands) ఇవీ..

  • భారత రెజ్లింగ్ సమాఖ్యకు  మహిళ ను చీఫ్ గా నియమించాలి.
  • రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలి.
  • మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ కు కానీ.. అతడి కుటుంబ సభ్యుల్లో మరొకరికి కానీ భారత రెజ్లింగ్ సమాఖ్యలో అవకాశం ఇవ్వకూడదు.
  • కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం జరిగిన రోజు తాము జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వైపు నిరసన తెలిపేందుకు వెళ్తుండగా అరెస్ట్ చేసి, పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
  • భారత రెజ్లింగ్ సమాఖ్య చీఫ్ బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలని రెజ్లర్లు కోరారు.