Site icon HashtagU Telugu

Powerful Passport: 2022లో జపాన్ దే పవర్ ఫుల్ పాస్ పోర్ట్..మరి ఇండియా ఏ స్థానంలో ఉందంటే!

Japan

Japan

సాధారణంగా ఎన్ని ఎక్కువ దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లగలిగితే ఆదేశ పాస్ పోర్ట్ అంత శక్తివంతమైనదిగా పరిగణిస్తూ ఉంటారు. అయితే ప్రతి ఏడాది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను విడుదల చేస్తూ ఉంటారు. కాగా ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పవర్ ఫుల్ పాస్పోర్ట్ ఏ దేశానిది అన్న సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022వ సంవత్సరంలో ప్రపంచంలో అత్యంత పవర్ ఫుల్ పాస్ పోర్ట్ గా జపాన్ పాస్ పోర్ట్ నిలిచింది. ఆ తర్వాత స్థానాలలో సింగపూర్, దక్షిణ కొరియా నిలిచాయి.

ప్రముఖ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ సంస్థ హెడ్లి అండ్ పార్ట్ నర్స్ తాజాగా విడుదల చేసిన పాస్ పోర్ట్ ఇండెక్స్ ఈ విషయాన్ని తెలిపింది. జపాన్ పాస్పోర్ట్ తో 193 దేశాలకు ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్లవచ్చట. అలాగే రెండవ స్థానంలో నిలిచిన సింగపూర్,దక్షిణ కొరియా పాస్పోర్టులతో 192 దేశాలకు ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్లవచ్చట. పవర్ ఫుల్ పాస్ పోర్టుల్లో యూరోపియన్ దేశాలలో జర్మనీ అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా చూసుకుంటే ప్రపంచవ నాలుగో పవర్ ఫుల్ పాస్ సపోర్ట్ గా ఉంది.

కాగా యూకే ఆరవ స్థానంలో నిలవగా, రష్యా 50వ స్థానంలో చైనా 60వ స్థానంలో నిలిచింది. చైనా పాస్ పోర్ట్ కు 80 దేశాలకు ఎటువంటి సమస్యలు లేకుండా వెళ్లవచ్చు. ఇక ఇండియా పాస్పోర్ట్ 87వ స్థానంలో నిలిచింది. ఇక చివరిగా అన్నిటికంటే తక్కువ విలువ కలిగిన పాస్పోర్టుగా ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ నిలిచింది.

Exit mobile version