Gamma Ray Telescope : కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు గుడ్ న్యూస్. ఆసియాలోనే అతిపెద్ద గామా రే టెలిస్కోప్‌ను అక్కడ ఆవిష్కరించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతంలో ఏర్పాటైన గామా రే టెలిస్కోప్ ఇదే కావడం విశేషం. లడఖ్‌లోని 4,300 మీటర్ల ఎత్తులో ఉన్న హాన్లే ప్రాంతంలో చెరెన్‌కోవ్ అనే పేరు కలిగిన గామా రే టెలిస్కోప్‌ను ప్రారంభించారు. దీన్ని ‘‘మేజర్ అట్మాస్పియరిక్ చెరెన్‌కోవ్ ఎక్స్‌పరిమెంట్’’ అని కూడా పిలుస్తారు. దీని తయారీలో ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్), ఈసీఐఎల్, ఇతర పారిశ్రామిక సంస్థలు సంయుక్తంగా కీలక పాత్ర పోషించాయి. చెరెన్‌కోవ్ గామా రే టెలిస్కోప్ బరువు 175 టన్నులు. ఇది 356 చదరపు మీటర్ల రిఫ్లెక్టర్ ఏరియాను కలిగి ఉంటుంది.
Also Read :Jawans Kidnapped : ఆర్మీ జవాన్లను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు.. ఒక జవాన్ హత్యతో కలకలం
గామా రే కిరణాలు, సూపర్ నోవా, బ్లాక్ హోల్స్‌పై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేయడానికి ఒక అబ్జర్వేటరీగా ఈ టెలిస్కోపు ఉపయోగపడబోతోంది. వాటిపై మంచి అవగాహనకు వచ్చేందుకు ఈ అబ్జర్వేటరీ మార్గం సుగమం చేయనుంది. గామా కిరణాలు భూ ఉపరితలానికి చేరకుండా భూ వాతావరణం అడ్డుకుంటుంది. అయితే గామా కిరణాలు వాతావరణంతో పరస్పర చర్య జరిపి.. కొన్ని అధిక శక్తి కణాలను సృష్టిస్తాయి. ఇవి విమాన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తూ చెరెన్‌కోవ్ రేడియేషన్‌ను రిలీజ్ చేస్తాయి.చెరెన్‌కోవ్ గామా రే టెలిస్కోప్‌లోని మిర్రర్లు, కెమెరాలు ఈ మొత్తం ప్రాసెస్‌ను క్యాప్చర్ చేయగలవు. గామా రేలను గుర్తించడానికి సాధ్యమైనంత తక్కువ కాంతి కాలుష్యం ఉండాలి. లడఖ్‌లోని హాన్లే ప్రాంతంలో కాంతి కాలుష్యం చాలా తక్కువ. అందుకే అక్కడ టెలిస్కోపును ఏర్పాటు చేశారు. అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్నందున ఈ టెలిస్కోపు (Gamma Ray Telescope) ద్వారా గామా కిరణాల మూలాలను స్పష్టంగా గుర్తించవచ్చని ఆశిస్తున్నారు. వాస్తవానికి ఈ టెలిస్కోపు ప్రారంభానికి ముందే 20 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలోని గామా కిరణాలను గుర్తించింది.