Lok Sabha Elections : పురుషులు 8,360 మంది.. మహిళలు 797 మంది.. లోక్‌సభ సీట్ల కేటాయింపులో వివక్ష

ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - May 23, 2024 / 08:58 AM IST

Lok Sabha Elections :  ఈ లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 543 స్థానాల్లో మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. అయితే వీరిలో మహిళలు 10 శాతంలోపే (797 మంది) ఉన్నారు. ఈవివరాలు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) వెల్లడించింది.  మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించిన తర్వాత కూడా ప్రధాన రాజకీయ పార్టీలు మహిళలకు లోక్‌సభ టికెట్లు ఇచ్చేందుకు సాహసించకపోవడం గమనార్హం. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదంలోకి వస్తే.. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల ఎన్నికల్లో వనితలకు మూడోవంతు సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో కనీసం 1 వంతు సీట్లను కూడా రాజకీయ పార్టీలు మహిళలకు కేటాయించకపోవడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

ఈ లోక్‌సభ ఎన్నికల ఏడు విడతలను పరిశీలిస్తే.. నాలుగో విడతలో మహిళలకు అత్యధికంగా 170  సీట్లు దక్కాయి. ఇక మొదటి విడతలో 135 మందికి, మూడో విడతలో 123 మందికి, రెండో విడతలో 100 మందికి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. ఇక మే 25న జరగనున్న ఆరో విడత ఎన్నికల్లో మొత్తం 869 మంది పోటీ చేస్తుండగా .. వారిలో 92 మంది మహిళలు ఉన్నారు. ఇక జూన్‌ 1న జరగనున్న చివరిదైన ఏడో విడత పోలింగ్‌లో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. వారిలో 95 మంది మహిళలు ఉన్నారు.  ఎన్నికల ఫలితాలు జూన్‌ 4న విడుదల కానున్నాయి.ఈ ఎన్నికల నాలుగో విడతలో అత్యధికంగా మొత్తం 1,717 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొదటి విడతలో 1,625 మంది, మూడో విడతలో 1,352 మంది, రెండో విడతలో 1,198 మంది బరిలో నిలిచారు. కాగా, 2019 ఎన్నికల్లో మొత్తం 8,054 మంది,  2014 ఎన్నికల్లో మొత్తం 8,251 మంది అభ్యర్థులు తలపడ్డారు. 2014, 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి అత్యధికంగా 8,360 మంది మంది పోటీ చేస్తున్నారు.

Also Read :Lankapalli Vasu : లంకపల్లి వాసు.. రేవ్ పార్టీ నిందితుడి చీకటి చిట్టా వెలుగులోకి

  • లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) పోటీచేస్తున్న అభ్యర్థులు అందరిలో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు లోక్‌సభ స్థానానికి టీడీపీ తరఫున పోటీచేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌ అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. తనకు రూ.5,705 కోట్ల ఆస్తి ఉంది.
  • తెలంగాణలోని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తనకు రూ.4,568 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిపారు.
  • మొత్తం 8,337 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో 1,644 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 1,188 మందిపై హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలు, విద్వేష ప్రసంగాలు తదితర తీవ్రమైన అభియోగాలతో క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read :Mokshagna Teja : నందమూరి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. మోక్షజ్ఙ ఎంట్రీపై..