Site icon HashtagU Telugu

Raichur: రాయచూరులో విషాద ఘటన.. తల్లీ, పిల్లల సజీవదహనం

Raichur

Resizeimagesize (1280 X 720) (2) 11zon

కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు (Raichur)లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాయచూరు జిల్లా శక్తినగర్‌లో సోమవారం సాయంత్రం ఓ మహిళ, ఆమె ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు అయ్యారు. మృతులను రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఆర్‌టీపీఎస్)లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సిద్దలింగయ్య స్వామి భార్య రంజిత (33), ఆమె పిల్లలు 13 ఏళ్ల మృదుల, ఆరేళ్ల తారుణ్యగా గుర్తించారు. శక్తినగర్‌లోని డీఏవీ స్కూల్‌లో మృదుల 6వ తరగతి, తారుణ్య అదే పాఠశాలలో యూకేజీ చదువుతున్నారు.

రాయచూర్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. కుటుంబం నివసిస్తున్న ఆర్‌టిపిఎస్ ఉద్యోగుల క్వార్టర్‌లోని ఎయిర్ కండీషనర్ పనితీరులో కొన్ని సమస్యలు ఏర్పడి మంటలు చెలరేగాయి. మంటలు మొత్తం నివాసానికి వ్యాపించడంతో ప్రాణనష్టం జరిగింది. ఈ కుటుంబం దక్షిణ కర్ణాటకలోని మాండ్య జిల్లా మలవల్లి తాలూకాలోని దళవోయ్కోడిహళ్లి గ్రామానికి చెందిన వారు అని అధికారులు తెలిపారు.

Also Read: Indonesia: ఇండోనేషియాలో విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి

సిద్దలింగయ్య స్వామి ఆర్టీపీఎస్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. అగ్ని ప్రమాదంలో అతని భార్య, ఇద్దరు పిల్లలు మరణించారు. మేము సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, కొన్ని సమస్యలతో ఉన్న ఇంట్లోని ఎయిర్ కండీషనర్‌కు మంటలు అంటుకున్నాయి మంటలు ఇంటి మొత్తానికి వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ముగ్గురు మరణించారు. ఇరుగుపొరుగు వారు సహాయం కోసం అక్కడికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోయారు. సంఘటన జరిగినప్పుడు సిద్దలింగయ్య స్వామి ఇంట్లో లేరు. బాధితుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం అని రాయచూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ నిఖిల్‌ తెలిపారు.