బెంగళూరు (Bengaluru ) నగరంలోని కోరమంగళ ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన నగరాన్ని షాక్ కు గురిచేసింది. శుక్రవారం తెల్లవారుజామున ఓ మహిళపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి (Woman Gangrape) పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు ముందుగా బాధితురాలితో పరిచయం పెంచుకుని తనను పాత స్నేహితుడిగా చెప్పుకున్నాడు. అతనిపై నమ్మకం ఏర్పడిన బాధితురాలు, అతనితో కలిసి సరదాగా హోటల్‌కు వెళ్లింది. అయితే అక్కడే మరో ముగ్గురు నిందితులు ఉండగా, ప్లాన్ ప్రకారం ఆమెను హోటల్ టెరస్‌పైకి తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డారు.
IPS Officers: ముగ్గురు ఐపీఎస్ అధికారులకు కేంద్ర హోంశాఖ షాక్..
ఘటన అనంతరం నిందితులు బాధితురాలికి సంబంధించిన విలువైన వస్తువులను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు. కాస్త తేరుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ ప్రారంభమైన వెంటనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అజిత్, విశ్వాస్, శివులు అనే నిందితులను పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్‌లో పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులంతా బెంగళూరులోని HSR లేఔట్ ప్రాంతంలోని ఓ హోటల్‌లో పని చేస్తుండగా, మిగిలిన నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Home Minister Anitha : ఏపీలో మహిళల రక్షణకు స్పెషల్ వింగ్, ప్రత్యేక యాప్..!
బాధితురాలు ఢిల్లీ వాసి కాగా, వివాహితురాలిగా బెంగళూరులో స్థిరపడినట్లు పోలీసులు వెల్లడించారు. డీసీపీ సారా ఫాతిమా తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలిని మెడికల్ టెస్టులకు తరలించి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. నిందితులపై కఠినమైన శిక్షలు విధించేందుకు అన్ని విధాలుగా దర్యాప్తు కొనసాగిస్తామని, త్వరలోనే పూర్తి సమాచారం వెల్లడిస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై నగరవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.