Haryana : పోలీసులు పక్కనుండగానే మహిళ ఖైదీఫై..మరో ఇద్దరు మగ ఖైదీలు అత్యాచారం..

ఇద్దరు మగ ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు

Published By: HashtagU Telugu Desk
Gang Rape Case

Gang Rape Case

దేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా మహిళలకు పూర్తి స్వేచ్ఛ , రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా మహిళ కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. గుడి , బడి , ఇల్లు , బయట అనే తేడాలు లేకుండా రెచ్చిపోతున్నారు. ప్రతి రోజు పదుల సంఖ్యలో అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హర్యానా లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పక్కన పోలీసులు ఉన్నప్పటికీ ,..ఇద్దరు ఖైదీలు , ఓ మహిళ ఖైదీ ఫై అత్యాచారం (Woman gangraped) చేసిన ఘటన పోలీసులను షాక్ కు గురి చేస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

హర్యానాలోని రోహ్‌తక్ జిల్లా (Rohtak District) జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ మహిళా ఖైదీని, అలాగే ఇద్దరు మగ ఖైదీలను చికిత్స నిమిత్తం రోహ్‌తక్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిజిఐఎంఎస్) కు జైలు వ్యానులో తీసుకు వెళ్లారు. వీరికి అక్కడ చికిత్స పూర్తి చేసి..మళ్లీ అదే వ్యాన్ లో ఎక్కించి..పోలీసులు డాక్యుమెంట్ వర్క్‌లో నిమగ్నమైయ్యారు. ఈ తరుణంలో ఇద్దరు మగ ఖైదీలు కలిసి మహిళా ఖైదీకి స్పైక్డ్ శీతల పానీయం తాగించారు. అనంతరం ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఖైదీ మాటలు విని పోలీసులు షాక్ కు గురయ్యారు. ఆ ఇద్దరి ఫై అత్యాచార కేసు కూడా నమోదు చేసి..మహిళ ఖైదీని హాస్పటల్ కు తీసుకెళ్లారు.

Read Also : Isha Arora: ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న పోలింగ్ అధికారి.. ఎవరీ ఇషా అరోరా..?

  Last Updated: 20 Apr 2024, 04:24 PM IST