Leopard: కొడుకు కోసం చిరుతతో తల్లి పోరాటం.. ఎక్కడంటే..?

బిజ్నోర్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చిరుతపులి (Leopard)తో పోరాడింది. బిడ్డను రక్షించే వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో తల్లికి కూడా గాయాలయ్యాయి. దాదాపు ఏడు నిమిషాల పాటు చిరుతపులితో కొడవలితో పోరాడింది.

  • Written By:
  • Updated On - February 15, 2023 / 01:32 PM IST

బిజ్నోర్‌లో ఓ తల్లి తన బిడ్డను కాపాడేందుకు చిరుతపులి (Leopard)తో పోరాడింది. బిడ్డను రక్షించే వరకు ఆ తల్లి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో తల్లికి కూడా గాయాలయ్యాయి. దాదాపు ఏడు నిమిషాల పాటు చిరుతపులితో కొడవలితో పోరాడింది. కొడుకు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లా నగీనా పోలీస్ స్టేషన్ పరిధిలోని జిత్‌పూర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓంప్రకాష్‌ భార్య ఇతరులతో కలిసి చెరకు తొక్కేందుకు పొలానికి వెళ్లింది. కొడుకు టికేంద్ర కూడా ఆమెతో ఉన్నాడు. కొడుకు కాస్త దూరంగా కూర్చుని ఉండగా ఒక్కసారిగా చిరుతపులి వచ్చింది.

కుమారుడిని చిరుతపులి చెరుకుతోటకు ఈడ్చుకెళ్లిందని మహిళ తెలిపింది. ఇది చూసి కూలీలు పరుగులు తీశారు. సాయం చేయడానికి ఎవరూ రాలేదు. ఆ మహిళ చేతిలో కొడవలి (చెరకు ఒలిచే ఆయుధం) ఉంది. దాన్ని తీసుకుని రంగంలోకి దిగింది. కొడుకు కేకలు వేయడంతో చిరుతపులి తన నోటితో కొడుకు మెడను నొక్కింది. కొడవలితో చిరుతపులిపై మహిళ దాడి చేసింది. మహిళపై కూడా చిరుతపులి దాడి చేసింది. మహిళ కొడవలితో చిరుతపులి మెడపై, పొట్టపై పలుచోట్ల దెబ్బలు వేసింది. దీంతో చిరుత కుమారుడిని వదిలి పారిపోయింది.

Also Read: Twitter CEO: ట్విట్టర్​ సీఈఓగా మస్క్ పెంపుడు కుక్క

మహిళ సాహసంతో పులి పారిపోయాక.. తీవ్ర గాయాలపాలైన కొడుకును తీసుకుని ఆమె ఒంటరిగా పొలం నుండి బయటకు తీసుకువచ్చింది. ఈ ఘటనలో ఆమెకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆమె కొడుకు టికేంద్ర తల, చేతులు, కడుపు, మెడపై లోతైన గాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బాలుడిని నగినాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. నగీనా హెల్త్ కేర్ సెంటర్ సెంటర్ ఇన్‌ఛార్జ్ డాక్టర్ నవీన్ చౌహాన్ మాట్లాడుతూ.. బాలుడి తల, మెడ, కడుపులో గాయాలు ఉన్నాయి. బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నందున, అతన్ని బిజ్నోర్ జిల్లా ఆసుపత్రికి తరలించి, అక్కడ నుండి చికిత్స కోసం రిషికేశ్ ఎయిమ్స్‌కు తీసుకెళ్లారని చెప్పారు.