Burnt Alive: కూల్చివేతల్లో దారుణం.. ఇద్దరు సజీవ దహనం

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ దేహత్​లో గల ఒక గ్రామంలో సోమవారం రోజు పోలీసులు, పరిపాలన బృందాలు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చి వేస్తున్న సందర్భంలో ఓ ఇంటికి నిప్పు అంటుకుంది.

  • Written By:
  • Publish Date - February 14, 2023 / 06:25 AM IST

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని కాన్పూర్ దేహత్​లో గల ఒక గ్రామంలో సోమవారం రోజు పోలీసులు, పరిపాలన బృందాలు అక్రమ నిర్మాణాలను జేసీబీలతో కూల్చి వేస్తున్న సందర్భంలో ఓ ఇంటికి నిప్పు అంటుకుంది. దీంతో ఆ ఇంట్లో ఉన్న 44 సంవత్సరాల మహిళ, 21 సంవత్సరాల ఆమె కూతురు అగ్నికి ఆహుతయ్యారు. వారిని కాపాడే క్రమంలో ఆ మహిళ భర్తకు గాయాలయ్యాయి.

కాన్పూర్ దేహత్‌లో ఆక్రమణలను తొలగిస్తుండగా తల్లి, కూతురు సజీవ దహనమయ్యారు. ప్రభుత్వ భూమిలోని అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు పాలకవర్గం నడుం బిగించిందని చెబుతున్నారు. కూల్చివేస్తున్న ఇంటి నివాసితులు అక్కడికక్కడే నిరసన తెలిపారు. ఇక్కడ ఆందోళనకారులు నిప్పు పెట్టుకుంటామని కూడా బెదిరించారు. కూల్చివేత జరుగుతున్న సమయంలోనే ఓ ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఇందులో తల్లి, కూతురు సజీవ దహనమయ్యారు. ఈ కేసు కాన్పూర్ దేహత్‌లోని మైథా తహసీల్ ప్రాంతానికి చెందిన మదౌలీ గ్రామానికి సంబంధించినది. ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అధికారులు భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

Also Read: Coimbatore: కోయంబత్తూరులో మహిళను తొక్కి చంపిన అడవి ఏనుగు !

పరిపాలన అధికారులు, గ్రామంలోని రౌడీలతో కలిసి మా గుడిసెకు నిప్పు పెట్టారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఇందులో మేము సజీవంగా బయటకు వచ్చాము కానీ మా అమ్మ, సోదరి మరణించారు. ఘటన అనంతరం అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కారును వదిలి పారిపోయారు. బాధితురాలి ఇంటిని తహసీల్‌ అధికారులు బలవంతంగా కూల్చివేశారని వారు ఆరోపించారు. ఘటనా స్థలంలో ఎస్పీతోపాటు భారీగా పోలీసులు మోహరించారు.

మరోవైపు, కాన్పూర్ దేహత్‌కు చెందిన ఎస్పీ ఐపిఎస్ బిబిజిటిఎస్ మూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమిలోని ఆక్రమణను తొలగించడానికి ఎస్‌డిఎఫ్ ఫోర్స్‌తో పాటు పోలీసు స్టేషన్ రూరాకు మధ్యాహ్నం వచ్చామని చెప్పారు. అదే సమయంలో పొలంలో పని చేస్తున్న మహిళ, ఆమె కుమార్తె గుడిసె వద్దకు రావడంతో వారు తలుపులు వేసి నిప్పంటించుకున్నారు. ఇద్దరూ చనిపోయారు. ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఎస్‌ఓ రూరా మహిళలను రక్షించేందుకు ప్రయత్నించగా అతని చేతులు కాలిపోయాయి. అతడికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.