బీహార్ కేంద్రంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన వ్యూహరచన ముందుకు కదులుతోంది. ఆయన వెళ్లిన వచ్చిన తరువాత ఆ రాష్ట్రంలో ప్రధాని అభ్యర్థిగా నితీష్ ను హైలెట్ చేస్తూ హోర్డింగ్ లు వెలవడం సంచలనంగా మారింది.
“జుమ్లా నహీ హకీహత్” (వాస్తవాలు కల్పితం కాదు), “మన్ కీ నహీ, కామ్ కి” (అసలు పని తనంతట తానుగా మాట్లాడుతుంది) ఈ నినాదాలతో కొత్త ప్రచారానికి నితీష్ కుమార్ అనుచరులు రంగంలోకి దిగారు. దీంతో ప్రధాన మంత్రి అభ్యర్థిగా నితీష్ ఫోకస్ అవుతున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసిన మరుసటి రోజు నుంచే బీహార్లో నితీష్ ప్రధాని అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు. బిజెపి వ్యతిరేక లీగ్‌ని తీసుకురావడానికి కేసీఆర్, నితీష్ ఇద్దరూ ఐక్యంగా ముందుకు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన నితీష్ వ్యూహాత్మకంగా ప్రధాని అభ్యర్థిత్వాన్ని అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు. ఏడుసార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవజ్ఞుడు. గతంలో ఎన్డీయే, యూపీఏతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. అందుకే ఆయన మోడీని ఢీ కొట్టే నాయకునిగా విపక్షాలు అంగీకరిస్తాయని నితీష్ అభిమానుల ఉవాచ.
బిజెపిని ఎదుర్కోవడానికి ఉమ్మడి ఎజెండాను రూపొందించడానికి ప్రధాన ప్రతిపక్ష నాయకులతో భేటీ కావడానికి నితీష్ కుమార్‌కు కెసిఆర్ సంయుక్తంగా స్కెచ్ వేశారని తెలుస్తోంది. మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్, అరవింద్ కేజ్రీవాల్ , ఎమ్‌కె స్టాలిన్‌లను తొలి విడత కలవడానికి ప్లాన్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే జాతీయ ప్రచారాన్ని ప్రారంభించారు. శరద్ పవార్ PM తరహా చర్యకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ లోలోన ఆయనకు కూడా ఆశలు ఉన్నాయి.+
JDU launches a series of posters and slogans positioning @NitishKumar for the national role
जुमला नहीं, हक़ीक़त!
मन की नहीं, काम की!
प्रदेश में दिखा, देश में दिखेगा! pic.twitter.com/GfkAo7fbIp
— Marya Shakil (@maryashakil) September 1, 2022
అపఖ్యాతి పాలైన జనతాదళ్ అరిష్ట జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే ప్రాంతీయ పార్టీలు ముందుకు కదిలితే ఐక్యంగా బిజెపిని ఎదుర్కోగలవని నితీష్ కుమార్, కెసిఆర్ ఆలోచన. గత సార్వత్రిక ఎన్నికల్లో 20 శాతం ఓట్లతో కాంగ్రెస్‌కు ప్రతిపక్షం బెంచ్ దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధినేత్రిగా ఉన్న సోనియా గాంధీతో చాలా మంది ప్రతిపక్ష నాయకులు సమీకరణాన్ని పంచుకున్నప్పటికీ ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి దూరంగా ఉంటున్నారు. ప్రధానమంత్రి పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టనుంది. అందుకే విపక్షాలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని నిలబెట్టాలని ప్రయత్నం చేస్తున్నాయి. కానీ, ఈడీ, సీబీఐ వంటి దాడులతో ఎవరూ సాహసం చేసి ముందుకు రావడంలేదని కేసీఆర్, నితీష్ సంయుక్తంగా ఒక ఆలోచనకు వచ్చారట. అందుకే, నితీష్ తనకు తానుగా పీఎం అభ్యర్థిగా ఫోకస్ అవుతున్నారు.