Kolkata Airport : కోల్‌కతా ఎయిర్‌పోర్టులో ఒకేసారి రన్‌వేపైకి రెండు విమానాలు

ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్‌ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి

  • Written By:
  • Publish Date - March 27, 2024 / 08:24 PM IST

కోల్‌కతా ఎయిర్‌పోర్టు(Kolkata Airport) లో పెను ప్రమాదం తప్పింది. ఒకేసారి రెండు విమానాలు ఒకే రన్‌ వేపైకి రావడంతో ఒకదానికొకటి ఢీకొీన్నాయి. ఈ ప్రమాదంలో ఇండిగో (IndiGo), ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్‌ప్రెస్ విమానాల రెక్కలు (leaving wings) విరిగాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం తో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక విమానం చెన్నైకి వెళ్తుంటే.. మరొక విమానం దర్భంగాకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లుగా డీజీసీఏ పేర్కొంది. చెన్నైకి వెళ్లే విమానం రెక్కల కొన విరిగిపోగా, మరో విమానం రెక్క కూలిపోయింది. ఇక ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. బుధవారం ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఎయిరిండియా విమానం చెన్నైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. విమానంలో ఆరుగురు క్యాబిన్‌ సిబ్బందితో పాటు 163 మంది ప్రయాణికులు ఉన్నారు. మరో విమానం ఇండిగోకు చెందింది కాగా.. కోల్‌కతా నుంచి దర్భంగాకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ఈ విమానంలో ఆరుగురు క్యాబిన్‌ సిబ్బందితో పాటు 149 మంది ప్రయాణికులు ఉన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగి ఉంటె పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది.

Read Also : KTR : కేటీఆర్కు ముందుంది ముసళ్ళ పండుగ – మధు యాష్కీ