94 ఏళ్ల వ‌య‌సులోనూ ఫుల్ ఫామ్‌లో అద్వానీ

లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియ‌ని స్ధితి నుంచి భార‌త దేశ రాజ‌కీయాల్లో గేమ్‌ఛేంజ‌ర్‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీని మార్చిన రాజ‌కీయ కురువృద్ధుడు.

  • Written By:
  • Updated On - November 8, 2021 / 11:53 AM IST

నవంబ‌ర్ 8, 2021 : లాల్ కృష్ణ అద్వానీ. 1984లో ఉందో లేదో తెలియ‌ని స్ధితి నుంచి భార‌త దేశ రాజ‌కీయాల్లో గేమ్‌ఛేంజ‌ర్‌గా భార‌తీయ జ‌న‌తా పార్టీని మార్చిన రాజ‌కీయ కురువృద్ధుడు. ఆయ‌న‌కు 94 ఏళ్లు.2014లో మోదీకి బాధ్య‌త‌లు అప్ప‌గించిన ద‌గ్గ‌ర్నుంచి పార్టీ కార్య‌కలాపాల్లో పూర్తిస్ధాయిలో పాల్గొన‌ని అద్వానీ.. తాజాగా జ‌రిగిన బీజేపీ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ క‌మిటీ మీటింగ్‌కు ప్ర‌త్య‌క్ష కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఆన్‌లైన్‌లో హాజ‌ర‌య్యారు.

2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయలేక‌పోయిన అద్వానీ.. మార్గ‌ద‌ర్శ‌క్ మండ‌లిలో ఒక స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న ప‌రిస్ధితి ప్ర‌స్తుతం ఇదీ..

Also Read : టార్గెట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలే

90 ఏళ్లు నిండినా కూడా వ‌య‌సు ప్ర‌భావాన్ని త‌న ప‌నిమీద ఏనాడూ చూపించ‌లేదు అద్వానీ.. ఇప్ప‌టికీ ఆయ‌న ప‌రోక్షంగా పార్టీ కార్య‌క‌లాపాల్లో పాల్గొంటున్నారు.

 

అద్వానీతో పాటు మార్గ‌ద‌ర్శ‌క్ మండ‌లిలో మ‌రో స‌భ్యుడు ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి. 1992లో క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు మోడీ చేసిన ఏక్తా యాత్ర‌లో భాగంగా ఉన్నారు ఆయ‌న‌. 1990లో అద్వానీ ర‌థ‌యాత్ర స‌మ‌యంలోనూ కీల‌కంగా ప‌నిచేశారు. జోషి కూడా ఆదివారం జ‌రిగిన బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి ఆన్‌లైన్‌లో హాజ‌ర‌య్యారు.

(ఎడ‌మ నుంచి కుడి వైపుకు – క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ్ బొమ్మాయ్‌, బీజేపీ క‌ర్నాట‌క అధ్య‌క్షుడు న‌లిన్‌కుమార్ కాటీల్‌తో పాటు మ‌రికొంతమంది కీల‌క బీజేపీ నేత‌లు కూడా ఆన్‌లైన్‌లోనే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశానికి హాజ‌రయ్యారు.