కేరళలోని వయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రియాంక గాంధీ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఆమె ప్రస్తుతం లక్షకు పైగా ఓట్ల లీడ్లో ఉన్నారు. కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక (Wayanad by-election) బరిలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అంతకు ముందు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha elections) రాహుల్ గాంధీ (Rahul Gandhi).. వయనాడ్ తో పాటు రాయ్ బరేలి లలో పోటీ చేసి రెండో చోట్ల విజయం సాధించారు.
కానీ ఈ రెండు చోట్ల నుండి ఏదొక స్థానం వదులుకోవాల్సి రావడం ఆయన వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఇప్పుడు ఎక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక ఈ ఉప ఎన్నికలో బిజెపి నుండి నవ్య హరిదాస్ (Navya Haridas) ను బరిలోకి దిగగా..కాంగ్రెస్ ప్రియాంక ను దించింది. ప్రత్యక్ష రాజకీయాల్లో అరంగేట్రం చేసిన ప్రియాంక కు వయనాడ్ ప్రజలు మంచి ఆదరణ అందించారని ఫలితాలు చూస్తే అర్ధం అవుతుంది. ఈ ప్రాంతం కాంగ్రెస్ కు కంచుకోట అని మరోసారి రుజువైంది .కాగా ఇటీవల MPగా గెలిచిన రాహుల్ గాంధీ 3.6 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. 2019లోనూ 4.3 లక్షల ఓట్ల మెజారిటీ సాధించారు. అయితే ఇక్కడ ప్రియాంకా గెలుస్తుందని అంతా భావిస్తున్నారు. మరి ఆమె తన సోదరుడి రికార్డును బ్రేక్ చేస్తారా? చూడాలి. తాజా పరిణామాలు, బూత్‌వారీ లెక్కల ఆధారంగా ప్రియాంక గాంధీ తన సోదరుడి రికార్డు బ్రేక్ చేస్తుందని అంత అంటున్నారు.
వయనాడ్ (Wayanad) విషయానికి వస్తే.. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఒక అందమైన హిల్స్ స్టేషన్ ఇది. ఇక్కడ ప్రకృతి అందాలు, తేలికైన వాతావరణం, మరియు చారిత్రక ప్రాధాన్యతతో ప్రసిద్ధి చెందింది. వయనాడ్ ప్రత్యేకంగా పర్యాటకులు మరియు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన వారు ఆహ్లాదకరమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదించవచ్చు. హరిత పర్వతాలు, కాఫీ మరియు మిరియాల తోటలు, దట్టమైన అడవులు వయనాడ్‌ను అందంగా మార్చాయి.
Read Also : Maharashtra Election Results 2024 : డబల్ సెంచరీ దిశగా మహాయుతి