Site icon HashtagU Telugu

Gali Janardhan Reddy : గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్స్ ను జైలు అధికారులు తీరుస్తారా..?

Gali Demands

Gali Demands

ఓబుళాపురం మైనింగ్ కేసులో సంచలన తీర్పు వెలువడింది. సుదీర్ఘ విచారణ అనంతరం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ కేసులో ఆయనతో పాటు మరో నలుగురు వ్యక్తులకు కూడా శిక్ష ఖరారైంది. గతంలోనే ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ద్వారా అక్రమ తవ్వకాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగిందని ఆరోపణల నేపథ్యంలో సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది.

Team India: విరాట్, రోహిత్‌ల‌ను భ‌ర్తీ చేసేది ఎవ‌రు? టీమిండియా ముందు ఉన్న స‌మ‌స్య‌లివే!

తాజాగా శిక్ష ఖరారైన గాలి జనార్దన్ రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఆయన కోర్టులో మరోసారి తన వాదనలు వినిపిస్తూ న్యాయస్థానాన్ని శిక్ష తగ్గింపుపై అభ్యర్థించారు. తన వయసును, చేసిన సామాజిక సేవలను గుర్తించి కొంత దయ చూపించాలని కోరారు. బళ్లారిలో, గంగావతిలో ప్రజలు తనను అఖండ మెజారిటీతో గెలిపించారనడం ద్వారా తన సేవలకు ప్రజలు గుర్తింపు ఇచ్చారన్న వాదనను కూడా ఆయన కోర్టులో వినిపించారు. అయితే న్యాయమూర్తి ఈ వాదనలపై తీవ్రంగా స్పందిస్తూ “ఈ కేసులో పదేళ్ల శిక్ష ఎందుకు విధించకూడదు?” అని ప్రశ్నించారు.

ఈ కేసులో గాలి జనార్దన్ రెడ్డితో పాటు బీవీ శ్రీనివాస్ రెడ్డి, వీడీ రాజగోపాల్, మెఫజ్ అలీ ఖాన్, ఓఎంసీ కంపెనీకి ఏడేళ్ల జైలుశిక్ష ఖరారైంది. అయితే ఇదే కేసులో ఉన్న సబితా ఇంద్రారెడ్డి, కృపానందంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని హైకోర్టు గతంలోనే నిర్దోషిగా తేల్చింది. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి ఓ పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేయగా, అది రిజిస్ట్రీ పరిశీలనలో ఉంది. దీనిపై న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.