Site icon HashtagU Telugu

Russia-Ukraine War: న్యూక్లియ‌ర్ ఆయుధాల‌ను ర‌ష్యా ఉప‌యోగిస్తుందా? మరి ఆ బాంబుల పరిస్థితి ఏమిటి?

Nuclear Weapons In Russia

Nuclear Weapons In Russia

ఉక్రెయిన్ పై మిల‌టరీ యాక్షన్ త‌ప్ప యుద్ధం చేయ‌డం లేద‌ని తొలుత ప్రక‌టించిన ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు స్ట్రాట‌జీ మార్చనున్నారు. పూర్తి స్థాయిలో యుద్ధమే చేయ‌నున్నారు. చివ‌ర‌కు అణు యుద్ధానికి దిగాల‌ని ఆలోచిస్తున్నారు. వారం రోజుల పాటు యుద్ధం జ‌రిగినా ఉక్రెయిన్‌లోని ఏ ప‌ట్టణంపైనా ర‌ష్యాకు ప‌ట్టు రాలేదు. బాంబులు వేసి ఆస్తి, ప్రాణ న‌ష్టం క‌లిగిస్తున్నారే త‌ప్ప ఒక్క దానినైనా స్వాధీనం చేసుకోలేక‌పోయారు.

దేశంలోని సామాన్య ప్రజ‌లు సైతం యుద్ధంలో పాల్గొంటుండడంతో వీధి పోరాట‌లే జ‌రుగుతున్నాయి. దాంతో ఆక్రమించ‌డం ర‌ష్యా సేన‌ల‌కు క‌ష్టంగా మారింది. ఆకాశంలో ఉక్రెయిన్ యుద్ధ విమానాలు గ‌ట్టిగా పోరాటం జ‌రుపుతున్నాయి. ర‌ష్యా విమానాల‌ను అంత‌గా రానీయ‌డం లేదు. గ‌గ‌నత‌లంలో ప‌ట్టు సాధించ‌లేక‌పోతోంది. క్లస్టర్ బాంబులు వేసినా వాటి ప్రభావం కొంత మాత్రమే.

తెలుగు పాత కాలం పౌరాణిక సినిమాల్లో ఒక బాణం వేస్తే మూడు నాలుగు బాణాలు వ‌చ్చే సీన్లు ఉంటాయి. క్లస్టర్ బాంబులు కూడా అదే విధంగా ఉంటాయి. విమానం నుంచి ఒక పెద్ద బాంబు వేస్తే దానిలోని చిన్న చిన్న బాంబులు ఎక్కువ విస్తీర్ణంలో చెల్లా చెదురుగా ప‌డుతాయి. వీటి వ‌ల్ల న‌ష్టం అధికంగా ఉండ‌డంతో ప్రపంచ దేశాల‌న్నీ నిషేధించాయి. కానీ ర‌ష్యా వీటిని ప్రస్తుతం ఉప‌యోగించి దాడులు చేసింది.

ఈ క్లస్టర్ బాంబులతో పాటు మిస్సైల్ దాడులు చేస్తున్నా అంత‌గా విజ‌యాలు రావ‌డం లేద‌ని భావించడంతో.. అత్యాధునిక సుఖోయ్‌-34 విమానాలు, అణ్వాయుధాల‌ను ఉప‌యోగించే అవ‌కాశం ఉంద‌ని ర‌క్షణ రంగ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. బేరెంట్స్ స‌ముద్రంలో న్యూక్లియ‌ర్ స‌బ్‌మెరిన్స్ యుద్ధ విన్యాసాలు చేశాయి. సైబీరియాలోని మంచు అడ‌వుల్లో మొబైల్ మిస్సైల్ ప్రయోగ వ్యవ‌స్థల‌ను సిద్ధం చేశారు. ఎలాంటి క‌ఠిన‌, ప్రతికూల ప‌రిస్థితులు ఎదుర‌యినా యుద్ధం చేయ‌గ‌ల‌గ‌డ‌మే ఈ ఏర్పాట్ల ల‌క్ష్యం.

Exit mobile version