Mamata Banerjee: బీజేపీ నేత సువేందు అధికారి వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ ను కోరినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సీఎం మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. గత వారం తృణమూల్ కాంగ్రెస్ జాతీయ పార్టీ హోదాను ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.
ఏప్రిల్ 18 న, బిజెపి నాయకుడు సువేందు అధికారి హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ.. టిఎంసి జాతీయ పార్టీ హోదాను రద్దు చేసిన తర్వాత మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేశారని పేర్కొన్నారు. కమిషన్ నిర్ణయాన్ని రద్దు చేయాలని బెనర్జీ షాను అభ్యర్థించారని అధికారి పేర్కొన్నారు. సువేందు అధికారి ఈ కామెంట్స్ తర్వాత పశ్చిమ బెంగాల్ రాజకీయాలు హీటెక్కాయి. ఈ ఆరోపణలను మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. టిఎంసి జాతీయ పార్టీ హోదాపై నేను అమిత్ షాను కోరినట్లు రుజువు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను అంటూ ఘాటుగా స్పందించారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి నన్ను టార్గెట్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 200 సీట్ల మార్కును దాటలేదని బెనర్జీ స్పష్టం చేశారు. అదే సమయంలో జాతీయ హోదాను రద్దు చేస్తూ పోల్ ప్యానెల్ నిర్ణయం తీసుకున్నప్పటికీ, తన పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్‌గా ఉంటుందని స్పష్టం చేశారు.
Read More: Pooja Hegde : అందమైన రెడ్ బ్లౌజ్ మరియు స్కర్ట్ లో బుట్టబొమ్మ