Site icon HashtagU Telugu

NTR త‌ర‌హాలో మ‌మ‌త ఫ్రంట్‌..2024లో మోడీ వ‌ర్సెస్ దీదీ

Mamatha Front

Mamatha Front

కాంగ్రెస్ లేకుండా జాతీయ స్థాయి కూట‌మిని తొలిసారిగా స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఏర్పాటు చేశాడు. ఆనాడు నేష‌న‌ల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసి సంచ‌ల‌నం సృష్టించాడు. ఇప్పుడు అదే బాట‌లో ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌త న‌డుస్తోంది. కాంగ్రెస్, బీజేపీలకు ప్ర‌త్యామ్నాయంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. స్వ‌ర్గీయ ఎన్టీఆర్ త‌ర‌హాలో మ‌మ‌త ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఆ క్ర‌మంలో యూపీఏ ప్ర‌స్తుతం మ‌న‌గ‌డలో లేద‌నే విష‌యాన్ని వెలుగొత్తి చాటింది. దేశ వ్యాప్తంగా ఆమె చేసిన కామెంట్ చ‌ర్చ‌కు దారితీసింది.ప్ర‌స్తుతం మోడీ హ‌వా కొన‌సాగుతోంది. ఆయ‌న‌కు స‌మానంగా ఫోక‌స్ కావాల‌ని దీదీ ప్ర‌య‌త్నం చేస్తోంది. 2024 నాటికి మోడీ, మ‌మ‌త మ‌ధ్య పోటీ ఉంటుంద‌నే సంకేతాల‌ను బ‌లంగా తీసుకెళ్ల‌డానికి పీకే ప్లాన్ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం యూపీఏలోని పార్టీలు, బ‌య‌ట ఉన్న రాజ‌కీయ పార్టీల‌ను క‌లుపుకుని తిరుగులేని శ‌క్తిగా ఎదగాల‌ని మ‌మ‌త ఆలోచ‌న‌. వారం క్రితం ప‌వార్ తో జ‌రిగిన ముంబాయ్ స‌మావేశం ఎజెండా కూడా ఆ ఆలోచ‌న‌లో భాగ‌మే. కాంగ్రెస్ పార్టీని మిన‌హాయించి మిగిలిన పార్టీల‌ను క‌లుపుకునే వెళ్లే ప్ర‌య‌త్నాల‌ను మ‌మ‌త చేస్తోంది.

మ‌మ‌త వేస్తోన్న అడుగుల దిశ‌గా యూపీఏలోని పార్టీలుగానీ, దాని వెలుప‌ల పార్టీలుగానీ ఉత్సాహం చూప‌డ‌లేదు. కానీ, వ‌చ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత మ‌మ‌త ప్లాన్ కు ఒక రూపం వ‌చ్చే అవ‌కాశం ఉంది. గోవా, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారే అవ‌కాశాలు లేక‌పోలేదు. యూపీఏ మ‌న‌గ‌డ ఇక ఉండ‌ద‌ని భావిస్తోన్న మ‌మ‌త 1977 నాటి ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను గుర్తు చేసుకుంటోంది. ఆనాడు జ‌న‌తా పార్టీ ఆవిర్భావానికి దారితీసిన ప‌రిస్థితులే ఇప్పుడు దేశంలో రాజ‌కీయ‌ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయ‌ట. ఇలాంటి ప్ర‌య‌త్నాల‌ను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ భోఫార్స్ తర్వాత చేశాడు. ఆనాడు ఎన్‌టి రామారావు కన్వీనర్‌గా ‘నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు అయింది. కానీ, 1991 సార్వత్రిక ఎన్నికలు జరిగే సమయానికి నేషనల్ ఫ్రంట్ క‌నుమ‌రుగు అయింది. ఆ త‌రువాత 1996 కాంగ్రెస్, బీజేపీ యేత‌ర ప‌క్షాలు కలిసి ‘యునైటెడ్ ఫ్రంట్ గా ఏర్ప‌డిన విష‌యం విదిత‌మే. రెండేళ్లు ఇద్దరు ప్రధాన మంత్రులను ఆ ఫ్రంట్ చూసింది. ఆ త‌రువాత 1999-2004 మధ్య వాజ్ పేయ్ ప‌డిన అవ‌మానాలను చూశాం. మే 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్‌డిఎ ఓడి పోయింది. అప్పుడే యూపీఏ పురుడుపోసుకుంది. ప‌దేళ్ల పాటు నిర్విరామంగా సోనియా క‌న్వీన‌ర్ గా యూపీఏ న‌డిచింది.

2014 మే నెల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో యూపీఏ ప‌క్షాలు ఘోర పరాజయంను రుచిచూశాయి. ఆ త‌రువాత జ‌రిగిన బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాగ‌స్వాములు ఆయా పరిస్థితుల‌కు అనుగుణంగా కాంగ్రెస్ ఉందామా ? వ‌ద్దా? అనేలా వ్య‌వ‌హిరించారు. కేర‌త‌, తమిళనాడు మరియు జమ్మూ కాశ్మీర్‌లో మాత్రమే కాంగ్రెస్ కూటమి భాగస్వాములను ప్ర‌స్తుతం క‌లిగి ఉంది.2019 మే 20, 2019 లోక్‌సభ తీర్పుకు మూడు రోజుల ముందు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ యుపిఎ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వచ్చిన మీడియా కథనాలను డిఎంకె నాయకుడు, ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ ఎలా ఖండించారు. మే 23న లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండ‌గా మీటింగ్ ఏమిట‌ని ప్ర‌శ్నించిన దాఖ‌లు ఉన్నాయి. ఇలా యూపీఏ భాగ‌స్వామ్య ప‌క్షాల మ‌ధ్య అగాధం క‌నిపించింది.తృణమూల్ వర్సెస్ కాంగ్రెస్, తృణమూల్ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ వర్సెస్ రాష్ట్రీయ జనతాదళ్, ప్రియాంక గాంధీ వర్సెస్ అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష శ్రేణుల మధ్య వైరుధ్యం ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో బ‌య‌ట ప‌డింది. ఇలా పంజాబ్ రాష్ట్ర ఎన్నికలలో పూర్తిగా కనిపించింది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ మరియు ఉత్తరప్రదేశ్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఆ విష‌యాన్ని మ‌మ‌త గుర్తు చేస్తోంది.

ములాయం సింగ్ యాదవ్ , లాలూ ప్రసాద్ బీహార్ మరియు ఉత్తరప్రదేశ్‌లలోకి ప్రవేశించడానికి పదే పదే ప్రయత్నించినా విజయం సాధించలేదు. శరద్ పవార్ నేతృత్వంలోని ‘నేషనలిస్ట్’ కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర వెలుపల ఛత్తీస్‌గఢ్, మేఘాలయ, గుజరాత్, గోవా మరియు డామన్ మరియు డయ్యూలలో విస్తరించడానికి తీవ్రంగా ప్రయత్నించింది, కానీ పెద్దగా విజయం సాధించలేదు.అయితే, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, JDU, JDS, మరియు BJD వంటి పూర్వ జనతా పార్టీ మరియు జనతాదళ్‌ల నుండి విడిపోయి విజయాన్ని అందుకున్న సంద‌ర్భాలు ఉన్నాయి.కాంగ్రెస్ అంతర్గత అంచనా ప్రకారం, పంజాబ్ఉ, త్తరాఖండ్ రెండింటిలోనూ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా ఉంటాయ‌ని భావిస్తోంది. గోవాలో తృణమూల్ కాంగ్రెస్ మరియు AAP రెండింటినీ అధిగమిస్తుందని అంచాన వేస్తోంది.కాంగ్రెస్ లోని G 23లో జాబితాలో ఉన్న 15 మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారని తృణమూల్ నాయకుడు ముకుల్ సంగ్మా చేసిన వాదన తప్పు అని రుజువు చేస్తుంది. రాజకీయ నాయకుల్లో రాజకీయ నాయకుడు పవార్ మహారాష్ట్రలోని ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా వేచి చూస్తున్నారు. ఎన్డీయేతర పక్ష నేతగా గాంధీల‌కు అండ‌గా ఉంటున్నాడు.
1999లో కాంగ్రెస్ నుండి వైదొలిగిన ఆరు నెలల్లోనే మరాఠా బలవంతుడు సోనియా గాంధీ నామినేట్ చేయబడిన కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్రింద మహారాష్ట్రలో అధికారాన్ని పంచుకున్నాడు. మరో మాటలో చెప్పాలంటే, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, సుస్మితా దేవ్ మరియు మిగిలిన వారిని కోల్పోయినందుకు పశ్చాత్తాపం కాంగ్రెస్ లో క‌నిపించ‌డంలేదు. రాహుల్ గాంధీ ‘ఆదర్శ’ స్థానాలకు కట్టుబడి కాంగ్రెస్ నింద నుండి తప్పించుకోలేరు. అహ్మద్ పటేల్ మరణించిన త‌రువాత యూపీఏ ప‌క్షాల‌ను ఒక‌టిగా ఉంచే ప్ర‌య‌త్నం రాహుల్‌గానీ, సోనియాగానీ చేయ‌లేక‌పోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో 2024 సాధార‌ణ ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా మోడీ వ‌ర్సెస్ దీదీగా జ‌రుగుతాయ‌ని పీకే భావిస్తున్నాడు.అందుకే, రాహుల్ నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల మీద కామెంట్స్ చేశాడు. సో..మ‌మ‌త‌, పీకే వేస్తోన్న ఎత్తుగ‌డులు దేశంలో ఫ‌లించే ఛాన్స్ ఉందా? లేదాని అంచ‌నా వేయ‌డానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఫ‌లితాల వ‌ర‌కు వేచిచూడాల్సిందే.