Site icon HashtagU Telugu

Rahul Gandhi Marriage: ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పెళ్లి…?

Rahul Gandhi Marriage

Rahul Gandhi Marriage

Rahul Gandhi Marriage: వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ వయనాడ్‌తో పాటు రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఆయన లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సోదరి ఇంటింటికీ వెళ్లి మహిళలను కలిసి ఓటర్లను తమ సోదరుడికి వోటెయ్యల్సిందిగా విజ్ఞప్తి చేసిందామె. ఈ క్రమంలో ఓ చిన్నారి రాహుల్ గాంధీని పెళ్లి గురించి ప్రశ్న వేసింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ చెప్పిన సమాధానం చూస్తుంటే రాహుల్ గాంధీ ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకోవచ్చని తెలుస్తుంది.

నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని రాహుల్ గాంధీని ఆ చిన్నారి ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. త్వరలో చేయాల్సి వస్తోందని అన్నారు. ఈ ప్రశ్న తర్వాత రాహుల్ గాంధీ నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా.. లేక పాప ప్రశ్నకు సరదాగా సమాధానం చెప్పాడా అనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఇదిలా ఉండగా ఈసారి మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు రాహుల్ గాంధీ రాత్రింబవళ్లు కష్టపడ్డాడు. ర్యాలీలు, పాదయాత్రలతో ప్రజల్లో తిరిగారు. ఇక రాహుల్ గాంధీ తొలిసారిగా ఈ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ స్థానం కాంగ్రెస్‌కు ప్రత్యేకం. అందుకే గాంధీ కుటుంబం రాయ్‌బరేలీని తమతో ఉంచుకోవడానికి రాహుల్‌ను రంగంలోకి దింపింది. ఈ స్థానం నుంచే గతంలో సోనియాగాంధీ, ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచారు.

Also Read: AP Polling : ఏపీలో 3గం ల వరకు 55 శాతం పోలింగ్