Rahul Gandhi : కాంగ్రెస్‌లో‌ని బీజేపీ ఏజెంట్లను ఫిల్టర్‌ చేస్తాం : రాహుల్‌

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. 

Published By: HashtagU Telugu Desk
Congress Leaders Rahul Gandhi Bjp Gujarat

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలు, నేతలను గుర్తించడంపై ఇక ఫోకస్ చేస్తామని ప్రకటించారు. గుజరాత్‌‌లోని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో రెండు రకాల వారు ఉన్నారని ఆయన తెలిపారు. ‘‘కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ కోసం నిజాయతీగా పనిచేస్తున్నారు. ప్రజలను గౌరవిస్తున్నారు. వారి కోసం పోరాడుతున్నారు. పార్టీ సిద్ధాంతాలను గౌరవిస్తున్నారు. ఇంకొందరు కాంగ్రెస్ నేతలు ప్రజలకు దూరంగా ఉండిపోయారు. వాళ్లు ప్రజలకు కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. అలాంటి వాళ్లలో సగం మంది బీజేపీతోనే టచ్‌లో ఉన్నారు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.

Also Read :Lalit Modi : వనౌతులో సెటిల్ కానున్న లలిత్ మోడీ.. ఆ దేశం విశేషాలివీ

రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చేరుకున్నారు.  ఈసందర్భంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆయన  మాట్లాడారు. ‘‘ మన పార్టీపరమైన బాధ్యతలను నెరవేర్చేంత వరకు అధికారం ఇవ్వమని గుజరాత్ ప్రజలను అడగకూడదు. పార్టీపరమైన బాధ్యతలను నెరవేర్చే వరకు రాష్ట్ర ప్రజలు మనకు ఓటు వేయరు’’ అని రాహుల్ పేర్కొన్నారు. ‘‘గత మూడు దశాబ్దాల్లో బీజేపీ అందించిన పాలన విఫలమైంది. గుజరాత్‌ ప్రజలు కొత్త విజన్‌ కోసం వేచి చూస్తున్నారు. ఆశించిన విధంగా రాష్ట్రం ప్రగతి సాధించడం లేదు. కాంగ్రెస్‌ కూడా అందుకు సరైన మార్గాన్ని చూపించలేకపోతోంది’’ అని ఆయన తెలిపారు.

Also Read :Kamala Harris : కమలా హ్యారిస్ మళ్లీ పోటీ చేస్తారా ? నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ?

యావత్ దేశం గుజరాత్ వైపు చూసింది

‘‘భారతదేశానికి స్వాతంత్య్రాన్ని సాధించడంలో కాంగ్రెస్ నేతలు మహాత్మాగాంధీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కీలక పాత్ర పోషించారు.వారి మార్గంలోనే కాంగ్రెస్ నడుస్తోంది. బ్రిటీష్ వాళ్లతో కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్న సమయంలో యావత్ దేశం గుజరాత్ వైపు చూసింది. ఎందుకంటే ఇక్కడి నుంచే స్వాతంత్య్ర ఉద్యమ నేత ఉద్భవించాడు. ఆయన పేరే మహాత్మా గాంధీ. ఆయనే యావత్ భారత జాతిని ఏకం చేశారు. బ్రిటీష్ వాళ్లపై పోరాటానికి దారులు చూపారు’’ అని రాహుల్ గాంధీ ఈసందర్భంగా గుర్తు చేశారు.

  Last Updated: 08 Mar 2025, 03:41 PM IST