India Pakistan War: ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. సూటిగా సుత్తి లేకుండా చెప్పాలంటే ఇరుదేశాల మధ్య యుద్ధం జరుగుతుందనే భయాలు అలుముకున్నాయి. ఒకవేళ భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధమే జరిగితే.. పరిస్థితేంటి ? పర్యవసానాలు ఎలా ఉంటాయి ? అంటే ఉపద్రవం ఏర్పడుతుంది. ఇరువైపులా ఆస్తినష్టం, ప్రాణనష్టం తప్పదు. ఇటువంటి భీకర యుద్ధమే వస్తే.. అగ్రరాజ్యం అమెరికా ఏం చేస్తుంది ? భారత్‌ను సమర్ధిస్తుందా ? అనే దానిపై అంతటా చర్చ జరుగుతోంది.
Also Read :Massive Explosion : ఇరాన్‌లో భారీ పేలుడు.. నలుగురు మృతి, 561 మందికి గాయాలు
ట్రంప్.. ఏం చేస్తారు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘అమెరికా ఫస్ట్’(India Pakistan War) అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ట్రంప్ చూపు అమెరికా ప్రయోజనాల వైపు మాత్రమే ఉంది. ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చొద్దనే క్లారిటీతో ట్రంప్ ఉన్నారు. ఇతర దేశాల కోసం నిధులను ఖర్చు పెట్టాలనే ఆలోచనే ప్రస్తుతం ట్రంప్‌కు లేదు. ఇప్పటికే ఆయన ఉక్రెయిన్‌కు, ఇజ్రాయెల్‌కు నిధులను కత్తిరించారు. భారత్ – పాక్ యుద్ధమే వస్తే.. పాక్ పక్షాన్ని ట్రంప్ తీసుకునే ఛాన్స్ లేదు. అయితే అదే సమయంలో ఆయన భారత్‌ను వ్యతిరేకించే అవకాశమే లేదు. ఎందుకంటే భారత్ అనేది అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. అమెరికా నుంచి భారీగా ఆయుధాలు కొనే దేశం కూడా భారతే. అమెరికా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది . ఈ పరిస్థితుల్లో భారత్ లాంటి పెద్ద వాణిజ్య భాగస్వామిని కోల్పోయే రిస్క్‌ను ట్రంప్ తీసుకోరు.
Also Read :Sudan War Effect: యుద్ధం ఎఫెక్ట్.. బొగ్గు, ఆకులు తింటున్న జనం
1 యుద్ధం.. 3 కోణాలు
- ఒకవేళ భారత్ సర్జికల్ స్ట్రైక్ చేస్తే.. పాకిస్తాన్ ఊరుకోదు. అది కూడా ప్రతిస్పందించే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల కొన్ని రోజుల పాటు ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతాయి. సరిహద్దుల్లో కొన్ని వారాల పాటు కాల్పులు కొనసాగుతాయి. ఈ స్వల్పకాలిక యుద్ధం వల్ల పాకిస్తాన్ మళ్లీ త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భారత్‌కు ఉగ్రవాదం నుంచి లభించే ఊరట సైతం తాత్కాలికమే అని రక్షణ రంగ పరిశీలకులు అంటున్నారు.
- ఒకవేళ భారత్ దీర్ఘకాలిక యుద్ధానికి సిద్ధమైతే.. పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్‌కు, భారత్‌తో దీర్ఘకాలిక యుద్ధం చేయడం కష్టతరంగా మారుతుంది. అక్కడ నిత్యావసరాల ధరలు మరింత పెరిగి, పాక్ ప్రజల జీవన చాలా దుర్భరంగా తయారవుతుంది. ఫలితంగా దీర్ఘకాలిక యుద్ధం ముగిసిన వెంటనే పాకిస్తాన్ కోలుకునే అవకాశం ఉండదు. దీనివల్ల భారత్‌కు దీర్ఘకాలం పాటు ఉగ్రవాదం నుంచి ఊరట లభిస్తుంది.
- దీర్ఘకాలిక యుద్ధం జరిగినప్పుడే.. భారత్ -పాక్ మధ్య అమెరికా, ఐక్యరాజ్యసమితి తలదూర్చే అవకాశం ఉంటుంది. యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నించే ఛాన్స్ ఉంటుంది. ఎవరూ ఊహించని విధంగా చైనా సైతం.. కీలక పాత్ర పోషించే దాఖలాలు ఉంటాయి. పాకిస్తాన్ పక్షాన్ని చైనా తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్‌కు చైనా ఆయుధాలను సప్లై చేయొచ్చు. భారత్‌కు ఇజ్రాయెల్, రష్యా, ఫ్రాన్స్‌ల సహకారం లభించొచ్చు.