Site icon HashtagU Telugu

Swami Nithyananda : రామమందిర ప్రారంభోత్సవంపై స్వామి నిత్యానంద కీలక ప్రకటన

Swami Nithyananda

Swami Nithyananda

Swami Nithyananda : పరారీలో ఉన్న వివాదాస్పద బాబా, అత్యాచార కేసు నిందితుడు స్వామి నిత్యానంద కీలక ప్రకటన విడుదల చేశారు. సోమవారం జరిగే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ తనకు ఆహ్వానం అందిందని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. తాను తప్పకుండా జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి హాజరవుతానని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ఈ చారిత్రాత్మకమైన, అసాధారణమైన సంఘటనను ఎవరూ మిస్ చేసుకోవద్దు.. సోమవారం రోజు శ్రీరాముడు అయోధ్య రామాలయ ప్రధాన దేవతగా ఆవాహన చేయబడతారు. ప్రపంచం మొత్తానికి దయను పంచే పరమాత్ముడు కొలువుతీరబోతున్నాడు’’ అని తన  ట్వీట్‌లో  స్వామి నిత్యానంద చెప్పారు. ‘‘భగవాన్ శ్రీ నిత్యానంద పరమశివం’’ ఈ గొప్ప కార్యక్రమానికి హాజరవుతారు అని ఆ పోస్టులో పేర్కొనడం గమనార్హం.  స్వయంగా అతని డ్రైవర్ ఫిర్యాదు ఆధారంగా 2010లో స్వామి నిత్యానందపై అత్యాచారం కేసు నమోదైంది. అనంతరం ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలైన నిత్యానంద(Swami Nithyananda).. 2020లో  మన దేశం వదిలి పారిపోయారు.

Also Read: Djokovic – Sania : సానియాతో కలిసి పనిచేస్తా.. అదే నా లక్ష్యం : జ‌కోవిచ్