Digvijay Singh : RSS చీఫ్ గా మహిళను నియమిస్తారా..? మోహన్ భగవత్ ను నిలదీసిన కాంగ్రెస్ సీనియర్ నేత..!!

RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Digvijay Singh

Digvijay

RSS చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. నాగ్ పూర్ లో బుధవారం జరిగిన దసరా ర్యాలీలో మోహన్ భగవత్ కు సంబంధించిన పలు కథనాలన ట్యాగ్ చేస్తూ …సంఘ్ కు ఓ మహిళను సర్సంఘచాలక్ గా నియమిస్తుందా అంటూ ప్రశ్నించారు.

భగవత్ వ్యాఖ్యలపై మీడియా కథనాలను ట్యాగ్ చేశారు. వరస ట్వీట్లతో విమర్శించారు. RSSమారుతుందా..? చిరుత పులి స్వభావాన్ని మార్చుకుంటుందా.? ఆర్ఎస్ఎస్ పాత్ర ప్రాథమికాలను మార్చడం గురించి వారు నిజంగా ఆలోచిస్తున్నట్లయితే..భగవత్ జీ నుంచి నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.

ఇక మరో ట్వీట్ లో ఆర్ఎస్ఎస్ తమ హిందూ రాష్ట్ర ఎజెండాను వదులుకుటుందా..సర్సంఘచాలక్ గా ఒక మహిళను నియమిస్తుందా…తర్వాత సర్సంఘచాలక్ “కొంకన్‌స్థేతరులు/చిత్తపవన్/బ్రాహ్మణులు” అవుతారా అంటూ దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు.

కాగా నాగపూర్ లోని రేషంబాగ్ మైదాన్ లో ఆర్ఎస్ఎష్ వార్షిక దసరా ర్యాలీలో భాగంగా మోహన్ భగవత్ మాట్లాడారు. భారత్ అన్ని సామాజిక వర్గాలకు సమానంగా వర్తించే విధంగా బాగా ఆలోచించి, సమగ్ర జనాభా నియంత్రణ విధానాన్ని రూపొందించాలని అన్నారు. దేశంలో జనాభా అసమతుల్యత సమస్య తలెత్తిందన్నారు. మైనార్టీలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని అన్నారు.

  Last Updated: 06 Oct 2022, 06:47 AM IST