Bihar : భార్య జుట్టు తెల్లబడిందని…రెండో పెళ్లికి యత్నించిన ప్రబుద్ధుడు…!!

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 11:05 AM IST

భార్య భర్తల మధ్య గొడవలు సర్వ సాధారణం. చిన్న చిన్న గొడవలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతునే ఆ సంసారం చక్కగా సాగుతుంది. కానీ నేటి కాలంలో టూత్ పేస్టు నచ్చలేదని విడాకులు తీసుకున్న దంపతులను చూస్తున్నాం. చిన్న విషయానికే అలిగి పుట్టింటికి వెళ్లే భార్యను చూస్తున్నాం. కానీ ఓ వ్యక్తి తన భార్యకు జుట్టు తెల్లబడిందని …గుట్టుచప్పుడు కాకుండా రెండో పెళ్లి చేసుకునేందుకు యత్నించిన విచిత్ర ఘటన బీహార్  లో చోటుచేసుకుంది.

పెళ్లయిన రెండు సంవత్సరాల తర్వాత తన భార్య జుట్టు మొత్తం తెల్లబడిందని..తరుచుగా గొడవకు దిగేవాడు. తన భార్యకు తెలియకుండా రెండో వివాహం చేసుకుంటుండగా అడ్డుకుంది. ఈ ఘటన సరన్ జిల్లాలో జరిగింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువురిని శాంతింపజేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహజిత్ పూర్ కు చెందిన బబితాదేవికి బనియాపూర్ కు చెందిన పంకజ్ సాహ్ తో రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లయిన కొన్నిరోజులకే భార్యభర్తల మధ్య మనస్పర్ధలు చోటుచేసుకున్నాయి. పెద్దలు ఇద్దరికి నచ్చచెప్పారు. కొన్నాళ్లు సరిగ్గానే ఉన్నారు.

తన భార్యకు తెల్లవెంట్రుకలు ఉన్నాయంటూ పంకజ్ రోజూ గొడవపడుతుండేవాడు. బబితాదేవికి ప్రతిరోజూ తీవ్రంగా దూషించేవాడు. చిత్రహింసలకు గురిచేసేవాడు. విసుగు చెందిన బబితా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అయితే సడెన్ గా పంకజ్ గుడిలో మరోవివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న బబితా…ఘటనాస్థలానికి వెళ్లి భర్తను చితకబాదింది. పంకజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.