Site icon HashtagU Telugu

Navy Officer Lieutenant Vinay : లెఫ్టినెంట్ వినయ్‌కి సెల్యూట్ చేస్తూ భార్య కన్నీటి వీడ్కోలు

Vinay

Vinay

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి(Jammu and Kashmir Pahalgam Terror Attack)లో భారత నౌకాదళాధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (Navy Officer Lieutenant Vinay) వీరమరణం చెందారు. తన భార్యతో హనీమూన్‌ కోసం వెళ్లిన ఈ యువ అధికారి అనూహ్యంగా ఉగ్రవాదుల బుల్లెట్లకు బలయ్యాడు. దాడి అనంతరం ఆయన భౌతికకాయాన్ని ఢిల్లీకి తీసుకువచ్చారు. ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా తదితరులు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా భర్త మృతదేహాన్ని హత్తుకుని భార్య హిమాన్షి విలపించిన తీరు, అక్కడున్న ప్రతీ ఒక్కరిని శోకసంద్రంలో పడేసింది.

Hyderabad MLC Election: 112 ఓట్లలో పోలైనవి 88.. ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ

లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ దేశ సేవ పట్ల అపారమైన అంకితభావంతో పనిచేశారు. కేరళలోని కొచ్చిలో విధులు నిర్వర్తిస్తున్న ఆయనకు సహచరులు, ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించాయి. ఎంతో ప్రతిభావంతుడిగా ఎదుగుతున్న సమయంలో జరిగిన ఈ దుర్ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఏప్రిల్ 16న వినయ్‌ వివాహం చేసుకొని, 19న రిసెప్షన్ ముగిసిన వెంటనే హనీమూన్‌ కోసం జమ్ముకశ్మీర్‌ వెళ్లారు. కానీ 22న జరిగిన ఉగ్రదాడిలో ఆయనను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ దాడిలో ఇద్దరు విదేశీయులతో పాటు 28 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు.

వినయ్‌ భౌతికకాయాన్ని హర్యానాలోని కర్నాల్‌ జిల్లాలోని ఆయన స్వగ్రామానికి తరలించి, సైనిక గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా భార్య హిమాన్షి కన్నీటి కళ్లతో సెల్యూట్ చేస్తూ భర్తకు తుదివీడ్కోలు పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్బ్రాంతిని కలిగించింది. వినయ్ వంటి యువ వీరుల త్యాగం దేశం ఎప్పటికీ మరచిపోదు. ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.