Covert Operation: పహల్గాం ఉగ్రదాడికి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్. ఇతడికి చెందిన లష్కరే తైబా ఉగ్రవాద సంస్థే పహల్గాంలో ఉగ్రదాడిని చేయించింది. ఈ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులంతా లష్కరే తైబా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే. అందుకే భారత్ గురి హఫీజ్ సయీద్‌పై ఉంది.
Also Read :Fastest UPI : జూన్ 16 నుంచి యూపీఐ లావాదేవీలు మరింత స్పీడ్.. ఎందుకు ?
లాడెన్ తరహాలో హఫీజ్ సయీద్ అంతానికి..
ఎలుక కలుగులో దాక్కున్నట్టుగా.. పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో దాక్కున్న అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను(Covert Operation) కోవర్ట్ ఆపరేషన్‌తో అమెరికా అంతం చేసింది. 2011 సంవత్సరం మే 2న ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ పేరుతో నిర్వహించిన ఈ ఆపరేషన్‌ను నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా పర్యవేక్షించారు. లైవ్‌లో చూశారు. అచ్చం అదే తరహాలో హఫీజ్ సయీద్‌ను మట్టుబెట్టేందుకు భారత్ స్కెచ్ గీస్తోందనే భయాలు పాకిస్తాన్‌ను వెంటాడుతున్నాయి. అందుకే లాహోర్‌లో ఉన్న హఫీజ్ సయీద్ ఇంటి చుట్టూ భద్రతను పాకిస్తాన్ ఆర్మీ నాలుగు రెట్లు పెంచింది.
Also Read :Electoral Rolls : ఇక జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా లింక్
భారత ఆర్మీ ప్లాన్లపై ఉత్కంఠ
గత రెండేేళ్లలో పాకిస్తాన్ గడ్డపై చాలామంది కరుడుగట్టిన ఉగ్రవాదుల వరుస హత్యలు జరిగాయి. బెలూచిస్తాన్ ఉగ్రవాదులు చాలా పేలుళ్లకు పాల్పడ్డారు. తెహ్రీక్ ఏ తాలిబన్ ఉగ్రవాదులు కూడా పెద్దఎత్తున పాక్ ఆర్మీపై దాడులు చేశారు. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ఉగ్రవాద సంస్థలే పాకిస్తాన్‌లో ఇదంతా చేయగలుగుతున్నప్పుడు.. భారత ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్‌తో లాహోర్‌లో దాక్కున్న పహల్గాం ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్‌ను అవలీలగా అంతం చేయగలదు. ఇప్పటికే భారత ప్రధాని మోడీ మన ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఈ స్వేచ్ఛను వాడుకొని భారత ఆర్మీ ఎలాంటి ఆపరేషన్లను ప్లాన్ చేస్తుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్‌లో ఉన్న హఫీజ్ సయీద్ లాంటి ఉగ్ర నేతలను టార్గెట్ చేస్తారని కొందరు అంచనా వేస్తుంటే.. పాక్ ఆక్రమిత కశ్మీరు(పీఓకే)లోని ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేస్తారని మరికొందరు అంచనా వేస్తున్నారు.