Lalit Modi : లలిత్ మోడీ వందల కోట్ల రూపాయల స్కామ్ చేసి మన దేశం నుంచి పరారయ్యాడు. భారత్‌లో ఐపీఎల్ టోర్నీలకు వ్యవస్థాపకుడిగా ఒక వెలుగు వెలిగిన ఆయన, ఈ స్కామ్‌లతో చేతులారా పరువును పోగొట్టుకున్నాడు. దర్యాప్తు సంస్థలను ఎదుర్కోలేక.. భారత్ నుంచి సిగ్గుతో బిచాణా ఎత్తేశాడు. విదేశాల్లో తలదాచుకొని దొంగలా తిరుగుతున్న లలిత్ మోడీ గురించి కొన్ని ఆసక్తికర అప్‌డేట్స్ వచ్చాయి. అవేంటో చూద్దాం..
Also Read :Kamala Harris : కమలా హ్యారిస్ మళ్లీ పోటీ చేస్తారా ? నెక్ట్స్ టార్గెట్ ఏమిటి ?
భారత పాస్‌పోర్ట్ అక్కర్లేదు : లలిత్
ఇంతకాలం బ్రిటన్ రాజధాని లండన్‌లో తలదాచుకున్న లలిత్ మోడీ(Lalit Modi).. త్వరలోనే మరో కొత్త దేశానికి మకాం మార్చనున్నారట. లలిత్ ఉండబోతున్న మరో దేశం పేరు వనౌతు (Vanuatu). అందుకే ఆయన కీలక ప్రకటన చేశారు. భారతదేశ పాస్‌పోర్ట్ ఇక తనకు అక్కర్లేదని లలిత్ ప్రకటించారు. పాస్‌పోర్ట్‌ను ఇచ్చేసేందుకు తాను రెడీ అంటూ లండన్‌లో ఉన్న భారత హైకమిషన్ కార్యాలయానికి ఆయన దరఖాస్తును సమర్పించారు. తాను వనౌతు దేశ పౌరసత్వాన్ని తీసుకున్నానని వెల్లడించాడు. వనౌతు దేశం గోల్డెన్ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తోంది. బాగా డబ్బున్న వాళ్లే దీనికి అర్హులు. వనౌతు దేశంలో పెట్టుబడులు పెట్టే ఆసక్తి కలిగిన వారికి గోల్డెన్ పాస్‌పోర్ట్‌లు ఇస్తారు. దీన్నే సిటిజెన్ బై ఇన్వెస్ట్‌మెంట్ (CBI) స్కీం అని కూడా పిలుస్తారు.
Also Read :Panch Vs Pati : భర్త చాటు భార్యలు.. మహిళా వార్డు సభ్యులకు బదులు భర్తల ప్రమాణం
వనౌతు దేశం విశేషాలివీ..
- దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో వనౌతు దేశం ఉంది.
- వ్యక్తుల చరిత్ర, నేపథ్యాలను పెద్దగా పరిశీలించకుండానే ఈ దేశం గోల్డెన్ పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తోంది. అందుకే ఎంతోమంది సంపన్నులు ఆ దేశం పౌరసత్వాన్ని తీసుకుంటున్నారు.
- వనౌతులో 83 అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిలో కొన్ని క్రియాశీల అగ్నిపర్వతాలు.
- మన భారతదేశంలోని నోయిడా నగర జనాభాలో సగం జనాభానే వనౌతులో ఉంటుంది.
- ఒకప్పుడు ఈ దేశం ఆంగ్లో-ఫ్రెంచ్ వలస కాలనీ.
- వనౌతు దేశానికి వచ్చే వార్షిక ఆదాయంలో దాదాపు 30 శాతం పౌరసత్వం విక్రయం ద్వారానే సమకూరుతుంది.
- వనౌతు దేశం పాలసీని ఆసరాగా చేసుకున్న లలిత్ మోడీ.. అక్కడి పౌరసత్వం తీసుకున్నాడు. ఆయన అక్కడే సెటిలయ్యే అవకాశం ఉంది.