Site icon HashtagU Telugu

Kejriwal : బెయిల్‌ కోసం ట్రయల్ కోర్టులో ఎందుకు పిటిషన్‌ చేయలేదు?: కేజ్రీవాల్‌కి సుప్రీం ప్రశ్న

Arvind Kejriwal

Arvind Kejriwal

Arvind Kejriwal: లిక్కర్‌ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ తీహార్ జైలో(Tihar Jai) ఉన్న విషయం తెలిసిందే. అయితే తన అరెస్టు, కస్టీడీని సవాల్‌ చేస్తూ..కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారా? అని సీఎం తరఫున న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీని ధర్మాసనం ప్రశ్నించింది.

We’re now on WhatsApp. Click to Join.

అయితే తాము ఎలాంటి పిటిషన్‌ వేయలేదని సింఘ్వీ తెలపగా.. బెయిల్‌ కోసం ముందు ట్రయల్‌ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని అడిగింది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌ అరెస్టు అక్రమమని, అందుకే తాము ఎలాంటి పిటిషన్లు వేయలేదని న్యాయవాది తెలిపారు. కేవలం సమన్లకు హాజరుకాలేదన్న కారణంతో అరెస్టు చేయడం సరికాదని వాదించారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Read Also: PM Modi: పండ్లు అమ్ముకునే మహిళ చేసిన పనికి మోడీ ఫిదా

మరోవైపు తీహార్ జైలో ఉన్న కేజ్రీవాల్‌ కలిసేందుకు ఆయన భార్యకు జైలు అధికారులు అనుమతించడం లేదని ఈ ఉదయం ఆప్‌ వర్గాలు ఆరోపించాయి. ఈ క్రమంలోనే సునీత(Sunitha) అభ్యర్థనను అధికారులు అంగీకరించారు. దీంతో ఈ మధ్యాహ్నం మంత్రి ఆతిశీతో కలిసి ఆమె తిహాడ్‌ జైలుకు వెళ్లారు.

Read Also: Kenya : తెగిన డ్యామ్‌..42 మంది మృతి..భారీగా జనం గల్లంతు

అనంతరం ఆతిశీ(Atishi) మీడియాతో మాట్లాడుతూ.. ”నన్ను చూడగానే సీఎం ఒకటే అడిగారు. పనులు ఎలా జరుగుతున్నాయి? స్కూల్‌ పిల్లలకు పుస్తకాలు అందాయా? మొహల్లా క్లినిక్‌లలో ఔషధాలు సరిపడా ఉన్నాయా? అని ఆరా తీశారు. తాను కచ్చితంగా బయటకు వస్తానని, ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని ప్రజలకు చెప్పాలని సందేశం పంపారు” అని వెల్లడించారు.