Site icon HashtagU Telugu

Delhi Liquor Case: కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్

Delhi Liquor Case

Delhi Liquor Case

Delhi Liquor Case: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు విషయంలో ఈడీకి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమోచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు శుక్రవారం సమాధానం ఇవ్వాలని ఈడీ తరపున వాదిస్తున్న అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్‌ను దేశ అత్యున్నత ధర్మాసనం ఆదేశించింది.

We’re now on WhatsAppClick to Join

మద్యం కేసులో ఈడీ తనను చట్ట విరుద్ధంగా అరెస్ట్ చేసిందని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం సుప్రీంకోర్టు విచారించింది. అంతకుముందు కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మద్యం కేసులో కేజ్రీవాల్ వ్యవహారాల ఇన్‌చార్జి విజయ్ నాయర్‌ను 2022లో ఈడీ అరెస్ట్ చేసిందని, అయితే కేజ్రీవాల్‌ను 2024లో అరెస్ట్ చేశారని ఆయన చెప్పారు. అయితే ఇంత సమయం ఎందుకు తీసుకున్నారనే విషయంపై క్లారిటీ లేదన్నారు. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాంగ్మూలం ఆధారంగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేసినట్లు ఈడీ తరుపు న్యాయవాదులు తెలిపారు. అయితే, ఆ వాంగ్మూలం ఇచ్చిన వెంటనే, ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవకు బెయిల్ మంజూరైందని సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి మొదట ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని, తర్వాత మాట మార్చారని వాదించారు.

Also Read: Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ లో 10 మంది నక్సలైట్లు హతం