Site icon HashtagU Telugu

Ministries Race : మంత్రిత్వ శాఖల కేటాయింపుపై సస్పెన్స్.. మోడీ నిర్ణయమే ఫైనల్

Ministries Race In Nda Govt

Ministries Race In Nda Govt

Ministries Race :  కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో తొలి క్యాబినెట్ భేటీ జరగబోతోంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు క్యాబినెట్ భేటీ జరుగుతుందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో తొలి 100 రోజుల రోడ్‌ మ్యాప్‌‌ను ఎన్డీయే సర్కారు రెడీ చేసుకోనుంది. శాఖలవారీగా 100 రోజుల రోడ్ మ్యాప్‌ను నిర్దేశించుకొని ముందుకు వెళ్లాలని ప్రధాని మోడీ భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువడటానికి రెండు రోజులు ముందే ప్రధాని మోడీ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశమై.. రాబోయే 100 రోజులకు శాఖలవారీగా కార్యాచరణ ప్రణాళికలను అందించాలని ఆదేశించారు. దీంతో అవి ఇప్పటికే ప్రధాని మోడీకి అందాయి. వాటిని ఇవాళ సాయంత్రం జరగనున్న మీటింగ్‌లో మంత్రులకు ప్రధాని మోడీ అందించే అవకాశం ఉంది. ప్రజల అంచనాలను అందుకునే రీతిలో పనిచేయాలనే సందేశాన్ని ఈసందర్భంగా మంత్రులకు(Ministries Race) మోడీ ఇవ్వనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

ఇక కీలకమైన మంత్రిత్వ శాఖలు ఎవరికి దక్కుతాయి ? బీజేపీ ఏయే శాఖలను తీసుకుంటుంది ? మిత్రపక్షాలకు ఏయే శాఖలను కేటాయిస్తుంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్థిక, రక్షణ, హోం, విదేశాంగ, రైల్వే శాఖలను బీజేపీ తన వద్దే ఉంచుకుంటుందనే అంచనాలు వెలువడుతున్నాయి.అయితే వ్యవసాయ, రైల్వే శాఖలను జేడీయూ పార్టీ అడుగుతోందని తెలుస్తోంది. ఇక జలవనరుల శాఖను టీడీపీ అడుగుతోందని సమాచారం. మాజీ సీఎంలు శివరాజ్ సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ లకు ఈసారి కీలక మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉంది. మంత్రిత్వ శాఖల విషయంలో  మిత్రపక్షాల డిమాండ్లు ఎలా ఉన్నప్పటికీ.. వాటిపై తుది నిర్ణయం తీసుకునేది మాత్రం ప్రధాని మోడీయే. ఆయన ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తారనే దానిపై త్వరలోనే క్లారిటీ వచ్చేస్తుంది. ఒకవేళ తాము ఆశించిన మంత్రిత్వ శాఖలు దక్కకుంటే జేడీయూ లాంటి పార్టీలు ఎలాంటి వైఖరిని తీసుకుంటాయి ? అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

Also Read :New Chief Minister : ఒడిశా ముఖ్యమంత్రిగా సురేశ్‌ పుజారి ? రేపటిలోగా క్లారిటీ

ఈసారి కేంద్ర మంత్రివర్గంలో బిహార్, ఉత్తరప్రదేశ్‌లకు అధిక ప్రాతినిధ్యం కల్పించారు. బిహార్ నుంచి 8 మందికి, యూపీ నుంచి 9 మందికి కేంద్ర క్యాబినెట్‌లో చోటు కల్పించారు. మంత్రిత్వ శాఖల కేటాయింపులోనూ ఆయా రాష్ట్రాలకు ప్రయారిటీ లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

Also Read :Talasani Srinivas Yadav : తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట తీవ్ర విషాదం