Arvind Kejriwal Arrest : కేజ్రీవాల్ కు శిక్ష పడితే..ఢిల్లీకి నెక్స్ట్ సీఎం ఎవరు..?

కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఆప్‌ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది

  • Written By:
  • Publish Date - March 22, 2024 / 09:04 AM IST

లిక్కర్ స్కామ్ కేసు ((Delhi Liquor Scam) )లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్(Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేయడం తో ..ఒకవేళ కేజ్రీవాల్ కు శిక్ష ఖరారైతే ఢిల్లీకి నెక్స్ట్ సీఎం (Delhi Next CM) ఎవరా..? అనేది ఇప్పుడు చర్చ గా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గురువారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అనేక దఫాలుగా నోటీసులు పంపినా స్పందించిన సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు…గురువారం సాయంత్రం సెర్చ్ వారెంట్‌తో సీఎం ఇంటికి వచ్చి విచారణ అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ఆయనను కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేకంగా సాగిన ఉద్యమానికి నాయకత్వం వహించి మూడు సార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా గెలిచిన కేజ్రీవాల్​, ఇప్పుడు అదే అవినీతి అరోపణలతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

We’re now on WhatsApp. Click to Join.

ఇక కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఆప్‌ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. రిటైర్డ్ IRS అధికారిణి అయిన ఆయన భార్య సునీత, మంత్రులు ఆతిశీ, సౌరభ్ భరద్వాజ్లలో ఒకరికి అవకాశం దక్కొచ్చని చర్చ జరుగుతోంది. అలాగే పార్టీ పగ్గాలను పంజాబ్ CM భగవంత్ మాన్కు అప్పగించే అవకాశముందని అంటున్నారు. మరి ఇదే జరుగుతుందా..అనేది చూడాలి. మరోపక్క కేజ్రీవాల్ అరెస్ట్​ను కాంగ్రెస్‌, డీఎంకే సహా పలు విపక్షాలు ఖండించాయి. పలు రాష్ట్రాల్లో ఆప్‌ ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్రం ఈడీని ప్రయోగిస్తోందని మండిపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఇలాంటి చర్యలకు దిగడమంటే రాజకీయ కక్షసాధింపు చేయడం ద్వారా విపక్షాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమేనని నేతలు విమర్శిస్తున్నారు.

అలాగే మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ట్విటర్‌ (Twitter) వేదికగా స్పందించారు. కేజ్రీవాల్‌ ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని కేటీఆర్‌ అన్నారు. ఆయన అరెస్ట్‌ ను ఖండిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను అణచివేయడం కోసం బీజేపీ ఈడీ, సీబీఐలను ప్రధాన ఆయుధాలుగా వాడుకుంటుందని ఆయన ఆరోపించారు. అవి రెండు కూడా బీజేపీ చేతిలో బొమ్మలుగా మారాయని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్‌ చేసుకుని ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ఇదే కేసులో కేటీఆర్ సోదరి, ఎమ్మెల్సీ కవితను(Kavitha) కూడా ఈడీ అధికారులు మార్చి 15న అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read Also : karthika Deepam 2: ఘనంగా కార్తీకదీపం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. వంటలక్క డాక్టర్ బాబుకి హారతులు?