Site icon HashtagU Telugu

Hindi Belt : హిందీ బెల్ట్‌లో కింగ్ ఎవరో.. తేలేది నేడే

Hindi Belt

Hindi Belt

Hindi Belt : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఆయువు పట్టు.. హిందీ బెల్ట్!! 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ చరిష్మా బాగా పనిచేసింది.. హిందీ బెల్ట్‌లోనే!! ఇప్పుడు అక్కడ మోడీ వేవ్ కంటిన్యూ అవుతోందా ? లేదా ? అనే దానిపై ఇవాళ క్లారిటీ వచ్చేస్తుంది. హిందీ బెల్ట్‌లోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితం ఉత్కంఠ రేపుతోంది. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా.. హిందీ బెల్ట్ ఓటర్ల ఆశీర్వాదం తప్పనిసరి. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను అద్దంపట్టేలా ఈ మూడు రాష్ట్రాల రిజల్ట్స్ ఉంటాయని పరిశీలకులు అంటున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

సీఎం అభ్యర్థులు లేకుండానే బీజేపీ.. 

రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మూడు చోట్ల కూడా సీఎం అభ్యర్థులను ప్రకటించకుండానే స్వయంగా ప్రధాని మోడీ ప్రచార రథాన్ని ముందుకు నడిపించారు. మధ్యప్రదేశ్‌లో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ఉన్న ప్రజా వ్యతిరేకత పార్టీపైకి రాకూడదని ఆయనను ఈసారి అభ్యర్థిగా అనౌన్స్ చేయలేదు. ఇక ఛత్తీస్‌గఢ్‌లో 15 ఏళ్ల పాటు వరుసగా సీఎంగా వ్యవహరించిన రమణ్‌సింగ్ లాంటి కీలక నేతను కూడా సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించలేదు. రాజస్థాన్‌లో వసుంధరా రాజేలాంటి దిగ్గజ నాయకురాలిని కూడా సీఎం క్యాండిడేట్‌గా అనౌన్స్ చేయలేదు. అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ మాత్రం మూడుచోట్ల సీఎం అభ్యర్థులపై ఫుల్ క్లారిటీతో ఎన్నికలకు పోయింది. ఈ పాయింట్.. ఏ పార్టీకి నెగెటివ్ అవుతుంది ? ఏ పార్టీకి పాజిటివ్ అవుతుంది ? అనేది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇవాళ ఉదయం 8గంటలకు నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు అప్‌డేట్స్‌ను eci.gov.inలో మనం చూడొచ్చు. ఉదయం 10.30 గంటల కల్లా ఆధిక్యం వివరాలు వెలువడటం మొదలవుతుంది.

Also Read: Telangana Poll 2023 : తొలి ఫలితం ఎక్కడి నుంచో తెలుసా ?

కీలక అంశాలు..