Tahawwur Ranas Lawyer: 2008లో జరిగిన ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వుర్ రాణా ప్రస్తుతం ఢిల్లీలోని తిహార్ జైలులో ఉన్నాడు. అతడిని గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపర్చగా, 18 రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ‘‘మీకు లాయర్ ఉన్నారా’’ అని తహవ్వుర్‌ను పాటియాలా హౌస్ కోర్టు ప్రత్యేక ఎన్‌ఐఏ న్యాయమూర్తి చంద్రజిత్ సింగ్ ప్రశ్నించగా.. ‘‘లేరు’’ అని బదులిచ్చాడు. దీంతో తహవ్వుర్ రాణాకు న్యాయవాదిని ఏర్పాటు చేయాలని ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ(DLSA)ని కోర్టు ఆదేశించింది. దీంతో రాణా తరఫున వాదించడానికి న్యాయవాది పీయుష్ సచ్‌దేవాను DLSA నియమించింది.
Tahawwur Ranas Lawyer: ఉగ్రవాది తహవ్వుర్ రాణా తరఫు న్యాయవాది ఎవరు?
