Site icon HashtagU Telugu

NCP President: NCP అధ్యక్ష రేసులో ఉన్నదెవరు?

NCP President

New Web Story Copy (71)

NCP President: దేశ రాజకీయాల్లో అగ్రగామి నేతల్లో ఒకరైన శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో తన జీవితకథను విడుదల చేస్తూ.. ‘నేను ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని ప్రకటించారు. నేనెప్పుడూ మీ వెంటే ఉంటానని పవార్ తెలిపారు.

పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన శరద్ పవార్ తన వారసుడి పేరును ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో శరద్ తర్వాత పార్టీ అధిష్టానం ఎవరి చేతుల్లో ఉంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఎన్సీపీ రేసులో కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో శరద్ కూతురు సుప్రియా సూలే, మేనల్లుడు అజిత్ పవార్ పేరు ముందు వరుసలో ఉంది. అయితే ఎన్సీపీ తదుపరి అధ్యక్షుడిగా ఛగన్ భుజబల్, జయంత్ పాటిల్, ప్రఫుల్ పటేల్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ మహారాష్ట్రలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఎన్సీపీలో ఆయన చాలా ప్రభావం చూపుతున్నారు. అయితే అజిత్ పవార్‌తో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 2019లో కూడా పార్టీపై తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అజిత్‌కి డిప్యూటీ సీఎం పదవి దక్కింది.

శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే కూడా ఎన్‌సిపి అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అజిత్ పవార్, సుప్రియా సూలే మధ్య పోరు సాగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుప్రియ ఎన్సీపీ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు. ఆమెకు మద్దతుగా చాలా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్సీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆమె.

మహారాష్ట్ర NCP అధ్యక్షుడు రేసులో జయంత్ ఉన్నారు. 2019లో వాల్వా అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఆయన రాష్ట్ర ఆర్థిక శాఖను నిర్వహించారు. ఆయన మహారాష్ట్ర బడ్జెట్‌ను 9 సార్లు ప్రవేశపెట్టారు. ఎన్సీపీకి చెందిన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ ప్రఫుల నాలుగు సార్లు లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. దీంతో పాటు ఐదుసార్లు రాజ్యసభ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు.

Read More: Hot Water: అయ్య బాబోయ్.. వేడి నేటితో స్నానం చేస్తే అన్ని రకాల ప్రయోజనాలా?