ISI Chief Promotion : పాకిస్తాన్‌కు సొంత బుర్ర అనేది లేదు. అందుకే భారత్ ఏం చేస్తే.. పాక్ కూడా అదేే కాపీ కొడుతోంది. ఇటీవలే భారత జాతీయ భద్రతా మండలి సమావేశం జరిగితే.. ఆ మరుసటి రోజే పాకిస్తాన్ జాతీయ భద్రతా మండలి సమావేశం కూడా జరిగింది. తాజాగా బుధవారం రోజు జాతీయ భద్రతా సలహా మండలిని భారత ప్రభుత్వం రీయాక్టివేట్ చేసింది. దానికి ఛైర్మన్‌గా భారత గూఢచార విభాగం ‘రా’ మాజీ సారథి అలోక్ జోషిని నియమించింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పాకిస్తాన్.. బుధవారం రాత్రి హుటాహుటిన మీటింగ్ ఏర్పాటు చేసింది. భారత్ నిర్ణయాన్ని కాపీ కొట్టి.. ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ చీఫ్‌గా ఉన్న మహ్మద్ ఆసిమ్ మాలిక్‌కు ప్రమోషన్ ఇచ్చింది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుడిగా ఆయనను నియమిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గతేడాది సెప్టెంబరులో ఐఎస్‌ఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ ఆసిమ్ మాలిక్‌కు.. ఇది ప్రమోషన్ లాంటిదే అని పాకిస్తాన్ సైనిక వర్గాలు అంటున్నాయి.
Also Read :Electronic Warfare : పాక్ వాయుసేనకు చుక్కలే.. రంగంలోకి భారత ఎలక్ట్రానిక్ వార్ఫేర్
మహ్మద్ ఆసిమ్ మాలిక్ ఇక ఏం చేస్తాడు ?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా తమపై భారత్ ఏ క్షణమైనా దాడి చేయొచ్చని పాకిస్తాన్ భయపడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో జాతీయ భద్రతా సలహాదారుగా మహ్మద్ ఆసిమ్ మాలిక్‌ను నియమించినా పాకిస్తాన్‌కు ఒరిగేదేం లేదు. పాకిస్తాన్ గూఢచార సంస్థ కోసం మహ్మద్ ఆసిమ్ మాలిక్ పనిచేస్తాడా ? పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుడిగా పనిచేస్తాడా ? ఏంచేస్తాడు ? అనే ప్రశ్నలు ఇప్పుడు రేకెత్తుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థ ఉమ్మడి పాత్ర ఉంది. ఈ ఉగ్రదాడిలో పరోక్షంగా భాగమైన మహ్మద్ ఆసిమ్ మాలిక్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం ద్వారా పాకిస్తాన్ భారత్‌ను మరింత కవ్వించే యత్నం చేస్తోంది.
Also Read :Pakistan Vs India : పాక్ చెరలోనే బీఎస్‌ఎఫ్ జవాన్.. చర్చలపై కొత్త అప్‌డేట్
ఆ కుట్రల వెనుక కీలక పాత్రధారిగా..
ఐఎస్ఐ చీఫ్‌గా నియమితుడు కావడానికి పాక్ ఆర్మీ జనరల్ హెడ్ క్వార్టర్స్‌లో అడ్జుటంట్ జనరల్‌గా మహ్మద్ ఆసిమ్ మాలిక్(ISI Chief Promotion) పనిచేశాడు. అతడు మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పర్యవేక్షించేవాడు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టులో, ఇమ్రాన్ మద్దతుదారుల అణచివేతలో కీలక పాత్ర పోషించాడు. అంతక్రితం బెలూచిస్తాన్, దక్షిణ వజీరిస్థాన్‌లో ఆర్మీ డివిజన్లకు నాయకత్వం వహించాడు. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం కూలడం వెనుక కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ హస్తం ఉందని అంటారు. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న మహ్మద్ యూనుస్ సర్కారులోని ఒక కీలక నేత, వారం రోజుల క్రితమే లష్కరే తైబా ఉగ్రవాదితో సమావేశం కావడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి కూడా భారత్‌లోకి ఉగ్రవాదులను పంపే ప్రయత్నం జరుగుతోందనే ఆందోళనను పెంచింది.