Vote From Home : దేశంలో లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఇంతకుముందు ఎన్నికలకు ఈసారి ఎన్నికలకు ఉన్న పెద్ద తేడా.. ఓట్ ఫ్రమ్ హోమ్ (Vote From Home)!! ఈసారి దేశమంతా అర్హులైన వారు ఇంటి నుంచే ఓటు వేయొచ్చు. అయితే అందుకు ఎవరు అర్హులు? ఎలా అప్లై చేాయలి ? వంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
నేరుగా ఇంటికే అవి తెస్తారు..
దేశంలో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈదఫా తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని కల్పించారు. 85 ఏళ్లకు పైబడిన వారు, 40శాతానికిపైగా అంగవైకల్యం కలిగిన వారు దీనికి అర్హులు. అలాంటి వారి ఇంటికి పోలింగ్ సిబ్బందే వెళ్లి ఓటు వేయించుకుంటారు. సదరు ఓటర్ల ఇంటికి ఓ కంపార్ట్‌మెంట్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లను తీసుకెళ్తారు.
Also Read : YS Sharmila : కడప లోక్‌సభ బరిలో షర్మిల.. అవినాశ్ రెడ్డితో ఢీ ?
అప్లై చేయడం ఇలా..
ఇంటి నుంచే ఓటు వేయాలని భావించే వృద్ధులు, దివ్యాంగులు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన 5 రోజుల్లోగా అప్లై చేసుకోవాలి. ఫార్మ్ 12డీ నింపి రిటర్నింగ్ అధికారికి కానీ, సహాయక రిటర్నింగ్ అధికారికి కానీ పంపాలి. ఈ దరఖాస్తు చేసుకునేవారు తమ చిరునామా, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ కూడా ఇవ్వాలి. ఫార్మ్ 12డీ అప్లికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్లో అందుబాటులో ఉంది. ఈ దరఖాస్తును అందుకున్న తర్వాత అప్లై చేసిన వారి ఇంటికి బూత్‌స్థాయి అధికారులు వెళ్తారు. అర్హతలను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది డిసైడ్ చేస్తారు. అనంతరం పూర్తి చేసిన ఫారం 12-డిని రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. అర్హత ఉంటే దరఖాస్తుదారుల ఇంటికి అధికారులే వెళ్లి ఓటును నమోదు చేయిస్తారు. ఇంటి నుంచి ఓటు వేసేటప్పుడు కూడా ఓటర్ ఎవరికి ఓటేస్తున్నారో ఎవరికీ తెలిసే అవకాశం లేకుండా ఏర్పాట్లు చేస్తారు.
Also Read :Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం చేసిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు
ఓట్ ఫ్రం హోం లెక్కలివీ..
- 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు దేశంలో 88.4 లక్షల మంది ఉన్నారు. వారంతా ఓట్ ఫ్రం హోంకు అర్హులే.
- 85 ఏళ్ల వయసుపై బడిన వారు 82 లక్షల మంది వృద్ధులు దేశంలో ఉన్నారు. వారు కూడా ఇంటి నుంచే ఓటు వేయొచ్చు.
- వందేళ్లకుపై బడిన 2.18 లక్షల మంది దేశంలో ఉన్నారు. వీరు సైతం ఓట్ ఫ్రం హోం చేయొచ్చు.
- పైన మనం చెప్పుకున్న అన్ని కేటగిరీలు కలుపుకొని మొత్తం 1.73 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఓట్ ఫ్రమ్ హోమ్ ఛాన్స్ ఇస్తారు.
- 85 ఏళ్లలోపు ఉన్న వృద్ధులు, 40 శాతం కంటే తక్కువ అంగవైకల్యం ఉన్న ఓటర్లకు పోలింగ్ స్టేషన్ల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. అన్ని పోలింగ్ బూత్‌లలో వాలంటీర్లను అందుబాటులో ఉంచుతారు. వీల్ చైర్‌లు ఏర్పాటు చేస్తారు.