Site icon HashtagU Telugu

Bal Sant Vs Lawrence : పదేళ్ల బాల సాధువుకు లారెన్స్ గ్యాంగ్ బెదిరింపు.. ఎందుకు ?

Bal Sant Abhinav Arora Vs Lawrence

Bal Sant Vs Lawrence : లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఆగడాలు ఆగడం లేదు. లారెన్స్ గుజరాత్‌లోని సబర్మతీ సెంట్రల్ జైలులోనే ఉన్నా.. అతడి గ్యాంగ్ మాత్రం రెచ్చిపోతోంది.  తాజాగా అభినవ్ అరోరా అనే పదేళ్ల బాలుడికి కూడా లారెన్స్ ముఠా నుంచి డెత్ వార్నింగ్ వచ్చింది. ఇంతకీ ఈ బాలుడు ఎవరు ? అతడికి లారెన్స్ గ్యాంగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చింది ? ఈ కథనంలో తెలుసుకుందాం..

Also Read :US Elections : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అలజడి.. బ్యాలట్ డ్రాప్ బాక్సులకు నిప్పు

అభినవ్ అరోరా గురించి..

  • అభినవ్ అరోరా ఢిల్లీ వాస్తవ్యుడు. వయసు పదేళ్లు.  అతడు తనను తాను బాల సాధువుగా ప్రకటించుకున్నాడు.
  • లారెన్స్ బిష్ణోయి ముఠా నుంచి అభినవ్‌కు ప్రాణహాని ఉందని ఇటీవలే అతడి తల్లి జ్యోతి అరోరా మీడియాకు తెలిపారు. తన కొడుకు భక్తిభావం గురించి ప్రచారం చేస్తున్నాడే తప్ప.. మరేమీ చేయడం లేదని ఆమె స్పష్టం చేశారు.
  • టెడ్ ఎక్స్ (TEDx) స్పీకర్ తరుణ్ రాజ్ అరోరా కుమారుడే అభినవ్ అరోరా(Bal Sant Vs Lawrence).
  • అభినవ్ అరోరా భక్తిభావానికి సంబంధించిన ప్రసంగాలు చేస్తుంటాడు. వాటిని అతడి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేస్తుంటారు.
  • మూడు సంవత్సరాల వయసు నుంచే అభినవ్ ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇస్తున్నాడు.
  • ఇటీవలే అభినవ్ ఒక శోభాయాత్రలో డ్యాన్స్ చేశాడు. అయితే దీనిపై ప్రముఖ హిందూ సన్యాసి స్వామి రామభద్రాచార్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక బోధనలు చేసేవారు అలా వ్యవహరించకూడదని అభినవ్‌కు స్వామి రామభద్రాచార్య సూచించారు.బహుశా ఈ ఘటన వల్లే అభినవ్ అరోరాకు లారెన్స్ గ్యాంగ్ నుంచి బెదిరింపు వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  •  అభినవ్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 9.5 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.
  • హిందూ పండుగలు, గ్రంధాల పారాయణాలు, మతపరమైన వ్యక్తుల జీవిత విశేషాలపై అతడు ప్రసంగాలు చేస్తుంటాడు.
  • కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఒకసారి అభినవ్‌ను అభినందించారు.
  • చాలామంది అభినవ్‌ను “బాల్ సంత్” అని, బలరామ్‌ అని పిలుస్తుంటారు.
  • అభినవ్ ఓ వైపు చదువుకుంటూనే.. మరోవైపు తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.
  • అభినవ్ క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తాడు. తెల్లవారుజామున 3:30 గంటలకు మేల్కొని జపమాల చదువుతాడు. అనంతరం పూజలు చేస్తాడు.