Site icon HashtagU Telugu

Indians: విదేశాల్లో ఉంటున్న భార‌తీయుల ‘లెక్క’ ఏక్క‌డ‌?

Indians

Indians

ఉక్రెయిన్-రష్యా యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో ఎదురుకాల్పుల్లో ఎంత మంది భారతీయులు చిక్కుకుపోతారనే వివరాలను తెలుసుకోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఒక బటన్‌ను నొక్కితే పొందగలిగే కంప్యూటరైజ్డ్ డేటా యుగంలో కూడా ప్ర‌భుత్వాలు వివ‌రాలు న‌మోదు చేయ‌లేదు. దేశం పాస్‌పోర్ట్ స్టాంపింగ్ సిస్టమ్‌ను కలిగి ఉన్నప్పటికీ, నిర్దిష్ట సమయంలో ఏ దేశంలో ఎంత మంది భారతీయులు ఉన్నారనే దానిపై డేటా మ‌న ద‌గ్గ‌ర లేదు.

ఈ విష‌యంలో ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, భారత ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నట్లు కూడా స్ప‌ష్టంగా కనిపిస్తుంది. గత సంవత్సరం గ్లోబల్ ఇండియన్ స్టూడెంట్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది, అయితే ఈ గణనలో ఇంకా పురోగతి లేదు. ఇత‌ర దేశాల్లో మ‌న వాళ్లు ఎంత‌మంది ఉన్నారో అని తెలుసుకోవ‌డానికి ఇన్నాళ్లు కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో త‌న‌కు అర్థంకావ‌డంలేద‌ని ఉక్రెయిన్ లో MBBS చ‌దువుతున్న విద్యార్థి తండ్రి బి సత్యన్నారాయణ తెలిపారు. త‌న కూతురు మెడిసిన్ కోర్సు కోసం మూడేళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లిందని.. ఇప్పుడు ఎంత మంది భారతీయ విద్యార్థులు ఉక్రెయిన్‌కు చదువు కోసం వెళ్లారో ప్రభుత్వానికి తెలియక‌పోవ‌డం త‌నకు చాలా వింతగా అనిపిస్తోందని ఆయ‌న అన్నారు. ఉక్రెయిన్ లో యుద్ధం ప్రారంభమైన తర్వాత అక్క‌డ చిక్కుకున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ విద్యార్థుల కోసం AP నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRTS)కి లింక్ చేయబడిన అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. సహాయం కోసం వారి పేర్లను నమోదు చేసుకోవాలని ప్ర‌భుత్వం ప్రజలను కోరింది.

ఆంధ్రా యూనివర్శిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ ఇక్కడ నగరంలో ఎంత మంది విదేశీయులు ఉన్నారు.. వారు ఏ ఉద్దేశ్యంతో నగరంలో ఉన్నారు అనే డేటా పోలీసుల వంటి స్థానిక అధికారుల వద్ద కూడా లేదని ఆరోపించారు. గత ఏడాది పార్లమెంటులో ఒక ప్రశ్నకు సమాధానంగా, విదేశాల్లోని విద్యార్థులకు సహాయం చేయడానికి గ్లోబల్ ఇండియన్ స్టూడెంట్ పోర్టల్‌ను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం తెలిపిందని ఇది ఇంకా అమ‌లు కాలేద‌ని ఆయ‌న తెలిపారు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ అందించిన అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 11 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల విద్యా సంస్థల్లో చేరారు. ఎంత మంది భారతీయులు తమ భూభాగాల్లో పనిచేస్తున్నారో లేదా నివసిస్తున్నారో కూడా భారత రాయబార కార్యాలయాలకు తెలియదు. కైవ్‌లోని భార‌త రాయబార కార్యాలయం ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థుల అంచనాలను అందుకోవడంలో విఫలమైందని ఫిర్యాదులు ఉన్నాయి.