Site icon HashtagU Telugu

Bayya Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ ఎక్కడ?

Bayya Sunny

Bayya Sunny

ప్రముఖ యూట్యూబర్‌ బయ్యా సన్నీ యాదవ్‌ (Bayya Sunny Yadav) ఈ మధ్య పాకిస్తాన్‌ టూర్‌కు వెళ్లిన తరువాత కనిపించకుండా పోవడంపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అదుపులోకి తీసుకుందన్న వార్తలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు. దీంతో సన్నీ ఎక్కడ ఉన్నాడనే అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అభిమానులలో కూడా ఆందోళన మొదలైంది.

Gulzar House : మరణాలకు ఫైర్ సిబ్బంది , ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యమే కారణం – బాధితుల ఆరోపణలు

ఈ వార్తలపై బయ్యా సన్నీ తండ్రి రవి స్పందిస్తూ.. తన కుమారుడికి పాకిస్తాన్‌తో ఎలాంటి అనుబంధం లేదని స్పష్టంగా తెలిపారు. బైక్‌పై దేశ విదేశాలు తిరగడం మినహా ఇతర కార్యకలాపాల్లో అనుమానించదగిన విషయం ఏదీ లేదన్నారు. సన్నీని ఎవరూ తీసుకెళ్లారో కూడా తమకు తెలియదని తెలిపారు. ఇప్పటివరకు అతడి ఆచూకీ తెలియకపోవడంతో కోర్టులో పిటిషన్‌ వేయనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉండగా బయ్యా సన్నీ యాదవ్‌ అరెస్టుపై NIA ఇప్పటికీ ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. అధికారిక సమాచారం లేకపోవడంతో సోషల్ మీడియాలో రకాల రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్‌ ద్వారా బయ్యా సన్నీ యాదవ్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి సుపరిచితుడయ్యాడు. ప్రస్తుతం అతను ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నకు సమాధానం దొరకకపోవడం కుటుంబ సభ్యులు, అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.