Site icon HashtagU Telugu

PM Modi Slept on Train Floor: ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద ఎందుకు పడుకున్నారో తెలుసా..!?

PM Modi Slept on Train Floor

Narendra Modi Creates new record in America modi visits America soon

PM Modi Slept on Train Floor: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన 73వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల్లోని బీజేపీ యూనిట్లు ప్రధాని మోదీ పుట్టినరోజును తమదైన రీతిలో జరుపుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. దామోదరదాస్ మోదీ, హీరాబా మోదీల ఆరుగురు సంతానంలో నరేంద్ర మోదీ మూడో సంతానం.

పిఎం మోడీ తన యవ్వనం నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సభ్యుడు. ఆయన రాజకీయ జీవితం 1970 నుంచి ప్రారంభమైంది. అయితే, 1990 వరకు ఆయన రాజకీయ జీవితం పెద్దగా ఊపందుకోలేదు. ప్రధాని మోదీ రాజకీయ జీవితంలో తొలినాళ్ల నుంచి వచ్చిన అనేక కథలు చాలా ప్రసిద్ధి చెందినవే. అలాంటి ఒక సంఘటనే 1990 నాటిది. ప్రధాని మోదీ టికెట్ ఉన్నప్పటికీ రైలులో కింద (PM Modi Slept on Train Floor) పడుకున్నారు. ఈ కథేంటో ఇప్పుదు మనం తెలుసుకుందాం.

ప్రధాని మోదీ రైలులో కింద ఎందుకు పడుకున్నారు..?

నిజానికి ప్రధాని మోదీ రైలులో కింద పడుకున్న కథను ఒకప్పుడు రైల్వేలో ‘సెంట్రల్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్’ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన లీనా శర్మ చెప్పారు. ‘ఇండియన్ రైల్వేస్ (ట్రాఫిక్)’ ప్రొబేషన్‌లో ఉన్నప్పుడు లక్నో నుండి ఢిల్లీకి తన ప్రయాణం ఎంత ఘోరంగా సాగిందో ది హిందూలో రాసిన కథనంలో ఆమె చెప్పింది. ఆ సమయంలో కొంతమంది రాజకీయ నాయకులు రైలులో తనతో, తన స్నేహితుడితో అనుచితంగా ప్రవర్తించారని లీనా చెప్పింది. టిక్కెట్టు దొరికిన తర్వాత కూడా వారు తమ సీటును వదిలేయాల్సి వచ్చిందని పేర్కొంది.

తాను, తన స్నేహితురాలు అహ్మదాబాద్ వెళ్లాల్సి ఉందని లీనా చెప్పింది. కానీ ఆమె లక్నో నుండి ఢిల్లీకి చేరుకున్నప్పుడు ఆమె స్నేహితురాలు ఇక ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంది. అయితే ఆ సమయంలో తన బ్యాచ్‌మేట్‌లలో ఒకరిని ట్రైన్ లో చూసింది. తరువాత ఢిల్లీ నుండి అహ్మదాబాద్‌కు ప్రయాణం ప్రారంభించారు. ఈసారి వారికీ టిక్కెట్లు కూడా లేవు. సమయం లేకపోవడంతో వారు టిక్కెట్లు తీసుకోలేకపోయారు. అయితే టీటీఈతో మాట్లాడి ఇద్దరినీ ఒకే బోగీలో కూర్చోబెట్టారు.

Also Read: PM Modi Birth Day Special : మ్యాజికల్ మ్యాన్ మోడీ.. ఛాయ్ వాలా టు ప్రైమ్ మినిస్టర్

అయితే వీరిద్దరూ కూర్చున్న బోగీలోని కంపార్ట్‌మెంట్‌లో అప్పటికే ఇద్దరు రాజకీయ నేతలు ఉన్నారు. లీనాకు ఇంతకు ముందు ప్రయాణ అనుభవం చూసి భయపడింది. అయితే ఇద్దరు నేతలూ చాలా మంచి వారని టీటీఈ హామీ ఇచ్చారు. కంపార్ట్‌మెంట్‌కు చేరుకోగానే లీనాకు, ఆమె బ్యాచ్‌మేట్‌కి లీడర్‌లిద్దరూ ఖాళీ చేసి ప్లేస్ ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలు మరెవరో కాదు నరేంద్ర మోదీ, శంకర్‌సింగ్ వాఘేలా. ఈ యాత్రలో రాజకీయాలు, చరిత్రపై చాలా చర్చలు జరిగాయి.

రాత్రి ఆహారం వచ్చినప్పుడు నలుగురి ఆహారానికి ప్రధాని మోదీ స్వయంగా డబ్బు చెల్లించారని లీనా చెప్పారు. డిన్నర్ అయిన వెంటనే టీటీఈ వచ్చి స్లీపింగ్ సీట్ ఏర్పాటు చేయలేమని లీనాకు చెప్పాడు. అది విన్న ప్రధాని మోదీ, శంకర్‌సింగ్ వాఘేలా లేచి నిలబడి ‘పర్వాలేదు, మేము ఏర్పాట్లు చేస్తాం’ అన్నారు. మోదీ వెంటనే రైలులోనే కింద ఒక క్లాత్ పరచి దానిపై పడుకున్నారు. మోదీ తన సీటును లీనా, ఆమె బ్యాచ్‌మేట్‌కు ఇచ్చాడు. ఇది తన మునుపటి రైలు ప్రయాణం అనుభవానికి పూర్తి భిన్నంగా ఉందని లీనా చెప్పింది. ఆ రాత్రి ఆ ఇద్దరు వ్యక్తుల సమక్షంలో తనకు ఎలాంటి భయం లేదని, ఎందుకంటే వారు చాలా సౌమ్యంగా, మంచి స్వభావం గల వ్యక్తులు అని లీనా చెప్పుకొచ్చింది.