Site icon HashtagU Telugu

WhatsApp : దేశంలో 19ల‌క్ష‌ల అకౌంట్ల‌ను బ్యాన్ చేసిన వాట్స‌ప్‌..కారంణం ఇదే…?

Whatsapp Imresizer

Whatsapp Imresizer

న్యూఢిల్లీ: కొత్త ఐటి రూల్స్ 2021కి అనుగుణంగా మే నెలలో భారతదేశంలో 19 లక్షలకు పైగా బ్యాడ్ అకౌంట‌న్ల‌ను నిషేధించినట్లు మెటా యాజమాన్యంలోని వాట్సాప్ తెలిపింది. ఈ ప్లాట్‌ఫారమ్ ఏప్రిల్‌లో భారతదేశంలో 16.6 లక్షల ఖాతాలను నిషేధించింది. దేశంలో మే నెలలో కంపెనీకి వ‌చ్చిన ఫిర్యాదుల ఆధారంగా అకౌంట్ల‌పై చ‌ర్య‌లు తీసుకున్నట్లు వాట్స‌ప్ తెలిపింది. తాము తమ‌ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, డేటా శాస్త్రవేత్తలు, నిపుణులు ప్రక్రియలలో స్థిరంగా పెట్టుబడి పెట్టామని వాట్సాప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, పెద్ద డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో నెలవారీ సమ్మతి నివేదికలను ప్రచురించాలి.

Exit mobile version