Most Used Platform : మన దేశంలో సైబర్ క్రైమ్స్ జరుగుతున్న తీరుతెన్నులపై కేంద్ర హోంశాఖ సంచలన నివేదికను విడుదల చేసింది. సైబర్ క్రైమ్స్ చేస్తున్న కేటుగాళ్లు అత్యధికంగా వాట్సాప్‌నే వినియోగిస్తున్నారని వెల్లడించింది. 2024 సంవత్సరంలో మొదటి మూడు నెలల వ్యవధిలో (జనవరి నుంచి మార్చి వరకు) 43,797 సైబర్ మోసాలు వాట్సాప్ ద్వారానే జరిగాయని తెలిపింది. 22,680 సైబర్ మోసాలు టెలిగ్రామ్ యాప్ ద్వారా, 19,800 సైబర్ మోసాలు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జరిగాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. 2023-2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికలో ఈవివరాలను ప్రస్తావించింది.
ఈ నివేదిక ప్రకారం.. సైబర్ కేటుగాళ్లు అమాయక నెటిజన్లను తమ వలలో వేసుకునేందుకు గూగుల్‌కు చెందిన వివిధ ప్లాట్‌ఫామ్స్ నుంచి వలలు విసురుతున్నారు. ఈక్రమంలో గూగుల్‌లో ఆకర్షణీయమైన యాడ్స్ ఇస్తున్నారు. సరిహద్దు లేకుండా తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకునేందుకు.. సాధ్యమైనంత ఎక్కువమంది అమాయక నెటిజన్లను చేరుకునేందుకు గూగుల్ యాడ్స్‌ను సైబర్ కేటుగాళ్లు వాడుకుంటున్నారు. నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, ఆర్థిక అవసరాల్లో ఉన్నవారిని టార్గెట్‌గా చేసుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో లోన్స్ ఇచ్చే యాప్స్‌ను కొన్ని సైబర్ ముఠాలు నడుపుతున్నాయి. అలాంటి వాటిని ట్రాక్ చేసేందుకుగానూ గూగుల్, ఫేస్‌బుక్‌లతో భారత హోంశాఖకు చెందిన ఐ4సీ విభాగం సమన్వయం చేస్తోంది. ఆన్‌లైన్ లోన్ యాప్స్(Most Used Platform) ఇచ్చే యాడ్స్ రాగానే ఆ సమాచారాన్ని ఐ4సీకి గూగుల్, ఫేస్‌బుక్‌లు పంపుతున్నాయి.
Also Read :Mumbai Terror Attacks : ముంబై ఉగ్రదాడి మాస్టర్ మైండ్ తహవ్వుర్ రాణా భారత్‌కు!
ప్రత్యేకించి ఫేస్‌బుక్ యాడ్స్‌ను సైబర్ కేటుగాళ్లు ఎక్కువగా వాడుకుంటున్నారని కేంద్ర హోంశాఖ నివేదికలో ప్రస్తావించారు. ప్రభుత్వ అనుమతులు లేని డిజిటల్ లోన్ యాప్‌లకు సంబంధించిన యాడ్స్‌ను ఫేస్‌బుక్‌పై రన్ చేస్తున్నారని వెల్లడించారు. అటువంటి యాడ్స్‌ను సత్వరం గుర్తించి నిలువరించేందుకు కేంద్ర హోంశాఖ తమ ఐ4సీ విభాగం ద్వారా గూగుల్, ఫేస్‌బుక్‌లతో టచ్‌లో ఉంటోందన్నారు.