Site icon HashtagU Telugu

Manish Sisodia: సిసోడియా పై లుకౌట్ నోటీసు

Manish Imresizer

Manish Imresizer

లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి సీబీఐ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు మరో షాక్ ఇచ్చింది. మనీశ్ సిసోడియా సహా మొత్తం 13 మంది నిందితులకు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని స్పష్టం చేసింది.
ఈ కేసులో మొత్తం 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.

గతేడాది నవంబర్ లో తీసుకువచ్చిన నూతన ఎక్సైంజ్ పాలసీలో వీరు అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రధాన కార్యదర్శి నివేదిక పేర్కొన్నారు. ఇందులో ఎక్సైజ్ అధికారులు, కంపెనీల ప్రతినిధులు, డీలర్లతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నట్లు తాజాగా సీబీఐ వెల్లడించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్న సిసోడియా విద్యాశాఖతో పాటు ఎక్సైజ్ శాఖను కూడా నిర్వహిస్తున్నారు. ఐతే మద్యం పాలసీ రూపకల్పన సమయంలో భారీగా అవకతవకలు జరిగాయని ఫిర్యాదులు అందడంతో సీబీఐ సోదాలు చేసి.. పలు కీలక ఆధారాలను సేకరించింది.

ఈ మొత్తం వ్యవహారంలో సిసోడియాను ఏ1గా పేర్కొంది. ఇదిలా ఉంటే లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా ట్విట్టర్ వేదికగా స్పందించారు. సీబీఐ సోదాల్లో ఏమీ దొరకలేదన్న ఆయన… ఇప్పుడేమో లుకౌట్ నోటీసులు జారీ చేశారని ట్వీట్ చేశారు. తాను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నానని.. ఎక్కడికి రావాలో చెప్పండి వస్తానంటూ రాసుకొచ్చారు. మరోవైపు ఈ కేసులో బీజేపీ , ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సీబీఐని ప్రయోగించి… బీజేపీ సర్కార్ తప్పుడు కేసులు పెడుతోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. సిసోడియాపై సీబీఐ ఆరోపణలను ఆప్ ప్రభుత్వ కూడా ఖండించింది. మరోవైపు బీజేపీ నేతలు కూడా… ఆప్ సర్కార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.