Site icon HashtagU Telugu

India – Pakistan War : S-500 వస్తే పాక్ పరిస్థితి ఏంటో..?

S 500 Missile Defense

S 500 Missile Defense

పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor) పాక్‌ మద్దతుదారుల ఉగ్రస్థావరాలపై సమర్థవంతమైన ప్రతిఘాతంగా నిలిచింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా పాక్‌ జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్లు పంపినప్పటికీ, భారత వాయు రక్షణ వ్యవస్థ (Indian Air Defense System) వాటిని ముందే గుర్తించి అడ్డగించింది. ఈ విజయానికి ప్రధాన కారణం భారత్‌ వద్ద ఉన్న ఎస్-400 మిసైల్‌ డిఫెన్స్‌ (S-400 Missile Defense) వ్యవస్థే. ఇది గాల్లోనే శత్రు విమానాలు, డ్రోన్లు, క్షిపణులను పేల్చివేయగలదు.

Pakistan Map : కశ్మీరును పాక్‌లో కలిపేసేలా మ్యాప్‌‌‌.. చిన్న పొరపాటే అంటున్న డీకే

ఎస్-400 మిసైల్ వ్యవస్థను భారత్ రష్యా నుండి 2018లో రూ.35 వేల కోట్లతో కొనుగోలు చేసింది. ఇందులో ఇప్పటికే మూడు యూనిట్లు భారత్‌లో మోహరించబడ్డాయి. ఉత్తర మరియు పశ్చిమ సరిహద్దుల్లో ఎస్-400లు పటిష్ట రక్షణ కవచంగా నిలిచాయి. 400 కిలోమీటర్ల పరిధిలోని శత్రు దాడులను గుర్తించి ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీనికి ఉంది. త్రిమితీయంగా 360 డిగ్రీల పరిధిలో పనిచేసే ఈ వ్యవస్థ బాలిస్టిక్ క్షిపణుల నుంచి యుద్ధ విమానాల వరకు అన్నింటిని తిప్పికొట్టగలదు.

Commission : సీఎం రేవంత్ రూ.20 వేల కోట్లు కమిషన్ నొక్కేసాడు..పక్క ఆధారాలు ఉన్నాయి – ఎమ్మెల్సీ కవిత

అయితే S-500 (S-500 Missile Defense)రాకతో భారత్‌ వైమానిక రక్షణ మరింత బలపడనుంది. ఇది S-400 కంటే అధునాతనంగా రూపుదిద్దుకుంది. S-500 వ్యవస్థ 600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను తిప్పికొట్టగలదు. ఇందులోని AESA రాడార్ 2000 కిలోమీటర్ల దూరం నుంచే టార్గెట్‌ను గుర్తించగల సామర్థ్యం కలిగిఉంది. హైపర్‌సోనిక్ క్షిపణులు, లో-ఆర్బిట్ శాటిలైట్లను కూడా ఇది ఛేదించగలదు. ప్రస్తుతం ఈ వ్యవస్థ భారత్ వద్ద లేకపోయినప్పటికీ, రష్యా-భారత్ ఉమ్మడి ఉత్పత్తి ప్రతిపాదనలతో త్వరలో ఇది భారత సైన్యంలో చేరనున్నది. ఇది రాగానే భారత్‌ ప్రపంచంలో అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కలిగిన దేశంగా నిలుస్తుంది.