Site icon HashtagU Telugu

41 Workers – 15 Days : 15వ రోజూ టన్నెల్‌లోనే 41 మంది.. ‘ప్లాన్ బీ’ రెడీ.. ఏమిటది ?

14 Days 41 Workers

14 Days 41 Workers

41 Workers – 15 Days : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ‌లో ఉన్న సిల్క్యారా టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 15 రోజులు. నిర్మాణంలో నాణ్యతా లోపం కారణంగా నవంబరు 12న  టన్నెల్ కూలడంతో వారంతా అందులో చిక్కుకున్నారు. కార్మికులు చిక్కుకున్న భాగానికి అడ్డుగా కూలిన భారీ కాంక్రీట్ దిమ్మెలను డ్రిల్లింగ్ చేసేందుకు అమెరికా నుంచి తెప్పించిన ఆగర్ మెషీన్ ఫెయిలైంది. పదేపదే అది మరమ్మతుకు గురైంది. దాని బ్లేడ్లు విరిగిపోయాయి. చివరకు ఆగర్ మెషీన్ మూలన పడింది. ఈరోజు నుంచి కూలీలే మ్యానువల్‌గా సొరంగాన్ని డ్రిల్లింగ్ చేయనున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

41 మంది కార్మికులకు ఎదురుగా దాదాపు 60 మీటర్ల మేర కాంక్రీట్ దిమ్మెలు ఉండగా.. ఇప్పటివరకు దాదాపు 50 మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయింది. ఇక మిగిలిపోయిన 10 మీటర్ల కాంక్రీట్ దిమ్మెలను కూలీలు డ్రిల్ చేయనున్నారు. మ్యానువల్ వర్క్ అయినందున.. వర్క్ పూర్తికావడానికి మరో రెండు రోజులు పడుతుందని అధికార వర్గాలు తెలిపాయి. రెస్క్యూ వర్క్ సజావుగా సాగితే.. మంగళవారం రాత్రికల్లా కార్మికులు బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. భారీ నిర్మాణ పనులు చేపట్టేందుకు దోహదపడే టెక్నాలజీ పెరిగినా.. భారీ నిర్మాణాలు ఇలా కూలినప్పుడు రెస్క్యూ ఆపరేషన్‌కు వినియోగించే పరికరాలు అందుబాటులో లేకపోవడం ఆందోళన రేకెత్తించే అంశం.

Also Read: Constitution Day 2023 : మన రాజ్యాంగం బర్త్ డే ఇవాళే

సొరంగం డ్రిల్లింగ్ కోసం ‘ప్లాన్ బీ’ అమలు చేసేందుకు రెస్క్యూ టీమ్ అధికారులు రెడీ అవుతున్నారు. ప్లాన్ బీలో భాగంగా సొరంగాన్ని నిలువు నుంచి కూడా భారీ యంత్రాలతో డ్రిల్లింగ్ చేయనున్నారు. బోర్ వెల్ తవ్వకానికి రంధ్రాలు ఎలా వేస్తారో.. అచ్చం అదేవిధంగా నిలువు డ్రిల్లింగ్‌లోనూ సొరంగం పైభాగం నుంచి కింది వైపుగా బోర్ రంధ్రాలు చేస్తారు. దీనివల్ల లోపల ఉన్న కార్మికులకు వెంటిలేషన్ అందుతుంది. వారితో కమ్యూనికేషన్ ఈజీ అయిపోతుంది. ఈ బోర్ రంధ్రాలను క్రమంగా వెడల్పుగా చేస్తారు. వాటిలో నుంచి కార్మికులను బయటకు లాగుతారు. ఈవిధంగా చేసే క్రమంలో కేసింగ్ అనే ప్రక్రియ ద్వారా బోర్‌వెల్‌ రంధ్రం చేసే భాగంలో రాళ్లు పడకుండా కంట్రోల్ చేస్తారు. అయితే నిలువు డ్రిల్లింగ్ దాదాపు 85 మీటర్లు చేయాల్సి ఉండటం అతిపెద్ద ఛాలెంజ్. ఇందుకోసం వాడే భారీ యంత్రానికి సంబంధించిన విడి భాగాలను ఇప్పటికే సొరంగంపైకి తరలించారు. అక్కడ వాటిని అసెంబ్లింగ్ చేశాక, పనులు మొదలవుతాయి. 41 మంది కార్మికులు చిక్కుకున్న సొరంగంలోని ఎగు భాగంలో నేల ఎంత గట్టిగా ఉంటే.. డ్రిల్లింగ్ వర్క్ అంత ఎక్కువ ఆలస్యం(41 Workers – 15 Days) అవుతుంది.