Ayodhya – January 22 : జనవరి 22.. ఇప్పుడు ఈ తేదీపైనే దేశమంతటా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ రోజున మధ్యాహ్నం 12.30 గంటలకు మన దేశంలో ఒక చారిత్రక ఘట్టం జరగబోతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య వేదికగా రామమందిరంలో శ్రీరాముడి దివ్య విగ్రహమూర్తిని ప్రతిష్ఠించబోతున్నారు. ఇంతకీ జనవరి 22వ తేదీనే ఈ కార్యక్రమం కోసం ఎందుకు ఎంపిక చేశారు ? ఆ రోజుకు ఉన్న ప్రత్యేకత ఏమిటి ? అనే దానిపై అంతటా డిస్కషన్ నడుస్తోంది. దీనితో ముడిపడిన ఆసక్తికర విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటిని ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join.
రాముడి విగ్రహం విశేషాలు..
జనవరి 22వ తేదీన నిర్ణయించిన ముహూర్తం విశేషాలను తెలుసుకునే ముందు.. మనం అయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహం గురించి తెలుసుకుందాం. ఈ విగ్రహం బరువు దాదాపు ఒకటిన్నర టన్నులు. నల్లరాతితో 51 అంగుళాల పొడవుతో దీన్ని చూడచక్కగా మలిచారు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన విగ్రహాన్నిఅయోధ్య రామమందిరం గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు.
- శ్రీరాముడు జన్మించింది అభిజిత్ ముహూర్తంలోనే. జనవరి 22న ఈ ముహూర్తం ఉదయం 11:51 గంటల నుంచి మధ్యాహ్నం 12:33 వరకు ఉంటుంది. అందుకే ఈ ముహూర్తాన్ని రాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎంపిక చేశారు.
- అభిజిత్ ముహూర్తంలోనే త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు చంపాడని పురాణాల్లో ప్రస్తావన ఉంది.
- జనవరి 22న తెల్లవారుజామున 3.52 గంటల నుంచి జనవరి 23న ఉదయం 4:58 గంటల వరకు మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం సోమ దేవతతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ శుభ ఘడియలో ఏదైనా పని చేస్తే అందులో మంచి జరుగుతుందని నమ్మకం.
- జనవరి 22న మృగశిర నక్షత్రంలో పవిత్రమైన అమృత సిద్ధి యోగం, సవర్త సిద్ధి యోగం ఏర్పడతాయి.
- జనవరి 22న అయోధ్య రామమందిరం గర్భగుడిలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం 84 సెకన్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం 12:29:08 గంటల నుంచి 12:30:32 గంటల వరకు ఈ ప్రోగ్రాం ఉంటుంది.
Also Read: Formula E Race : ‘ఫార్ములా-ఈ’ కార్ల రేస్ రద్దు.. తెలంగాణ సర్కారు నిరాసక్తి
రామ మందిర నిర్మాణం కారణంగా అయోధ్యలో భూములు, ఆస్తుల ధరలు నాలుగు రెట్లు పెరిగాయి. ఈ జోరు ఇంకా ఆగడం లేదంటున్నారు ప్రాపర్టీ మార్కెట్ నిపుణులు. బాహ్య పెట్టుబడిదారులతో పాటు, స్థానిక కొనుగోలుదారులు కూడా ఆస్తిలో పెట్టుబడి పెడుతున్నారు. తాజ్, రాడిసన్ వంటి పెద్ద హోటల్ చైన్‌లు కూడా ఇక్కడ భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అదేవిధంగా, అనేక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా అయోధ్యపై(Ayodhya – January 22) దృష్టి పెట్టాయి.